Krishna Bhagawan counters on Indraja in jabardasth latest promo
Indraja : వెండితెరపై కృష్ణభగవాన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బుల్లితెరపై దుమ్ములేపేస్తున్నాడు. తన కామెడీ టైమింగ్‌కు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. స్వతహాగా ఆయన రచయిత. అందుకే కామెడీ మీద ఈ రేంజ్‌లో పట్టుంది. ఇలాంటి కృష్ణ భగవాన్‌ను జబర్దస్త్ షోకు పర్మనెంట్ జడ్జ్‌ను చేసేయండని జనాలు కోరుకుంటున్నారు. ఆయనే జడ్జ్‌గా ఉండాలని యూట్యూబ్ కింద కామెంట్లతో దాడి చేస్తున్నారు. మధ్యలో కొన్ని రోజులు కృష్ణ భగవాన్ కనిపించకపోయే సరికి అందరూ అల్లాడిపోయారు. తాజాగా వదిలిన ప్రోమోలో కృష్ణ భగవాన్ కనిపించాడు. ఇక ఆయన వేసిన పంచులకు అందరూ ఫిదా అయ్యారు. మామూలుగానే ఆయన పంచులు తారాస్థాయిలో ఉంటాయి.
ఇలాంటి షోల్లో ఇంకా ఆయన ఎలాంటి కౌంటర్లు వేస్తారో ఊహించుకోవచ్చు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు ఓ సారి గెస్టుగా వచ్చిన కృష్ణ భగవాన్ అప్పటి నుంచి ఇలా బుల్లితెరకు అంకితమయ్యాడు. మల్లెమాల ఈవెంట్లలో కృష్ణ భగవాన్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాఘవ స్కిట్ అదిరింది. ఉప్పెన సినిమాను సూర్య కాంతం, రేలంగి కలిసి తీసి ఉంటే ఎలా ఉండేదో చేసి చూపించారు. ఇక సూర్యకాంతం లుక్స్, హావభావాలు, నటనను అన్నీ దించేశాడు రాఘవ. అచ్చం సూర్యకాంతంలానే అనిపించింది. మొత్తానికి ఈ స్కిట్ చూసి అందరూ ఫిదా అయ్యారు. జడ్జ్‌గా ఉన్న ఇంద్రజ అయితే నిజంగానే ఎమోషనల్ అయింది.
Krishna Bhagawan counters on Indraja in jabardasth latest promo
ఇది మా అదృష్టం అంటూ రాఘవను పొగిడేసింది. అయితే మాటల్లో మాటగా సూర్యకాంతం మా ఊరే అని కృష్ణ భగవాన్ అనేస్తాడు. ఏంటి మీరు ఆమె వచ్చిన ఊరు నుంచి వచ్చారా? అని ఇంద్రజ ఆశ్చర్యపోతోంది. ఆమె వచ్చిన ఊరు నుంచి వచ్చిన మీరు.. చేసేది ఇదేనా? అని అంటున్నారా? అని ఇంద్రజకు రివర్స్ కౌంటర్ వేస్తాడు కృష్ణ భగవాన్. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. కానీ ఈ స్కిట్, రాఘవ పర్ఫామెన్స్‌ను కృష్ణ భగవాన్ ఎంతో మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్కిట్టే ఎపిసోడ్‌కు హైలెట్ అయ్యేలా ఉంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.