Indraja : ఇంద్రజకు చాన్సే ఇవ్వడం లేదు.. కృష్ణ భగవాన్ మామూలోడు కాదు

Authored By aruna | The Telugu News | Published on: September 20, 2022, 3:30 pm

Indraja : వెండితెరపై కృష్ణభగవాన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బుల్లితెరపై దుమ్ములేపేస్తున్నాడు. తన కామెడీ టైమింగ్‌కు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. స్వతహాగా ఆయన రచయిత. అందుకే కామెడీ మీద ఈ రేంజ్‌లో పట్టుంది. ఇలాంటి కృష్ణ భగవాన్‌ను జబర్దస్త్ షోకు పర్మనెంట్ జడ్జ్‌ను చేసేయండని జనాలు కోరుకుంటున్నారు. ఆయనే జడ్జ్‌గా ఉండాలని యూట్యూబ్ కింద కామెంట్లతో దాడి చేస్తున్నారు. మధ్యలో కొన్ని రోజులు కృష్ణ భగవాన్ కనిపించకపోయే సరికి అందరూ అల్లాడిపోయారు. తాజాగా వదిలిన ప్రోమోలో కృష్ణ భగవాన్ కనిపించాడు. ఇక ఆయన వేసిన పంచులకు అందరూ ఫిదా అయ్యారు. మామూలుగానే ఆయన పంచులు తారాస్థాయిలో ఉంటాయి.

ఇలాంటి షోల్లో ఇంకా ఆయన ఎలాంటి కౌంటర్లు వేస్తారో ఊహించుకోవచ్చు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు ఓ సారి గెస్టుగా వచ్చిన కృష్ణ భగవాన్ అప్పటి నుంచి ఇలా బుల్లితెరకు అంకితమయ్యాడు. మల్లెమాల ఈవెంట్లలో కృష్ణ భగవాన్ ఎక్కువగా కనిపిస్తున్నాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాఘవ స్కిట్ అదిరింది. ఉప్పెన సినిమాను సూర్య కాంతం, రేలంగి కలిసి తీసి ఉంటే ఎలా ఉండేదో చేసి చూపించారు. ఇక సూర్యకాంతం లుక్స్, హావభావాలు, నటనను అన్నీ దించేశాడు రాఘవ. అచ్చం సూర్యకాంతంలానే అనిపించింది. మొత్తానికి ఈ స్కిట్ చూసి అందరూ ఫిదా అయ్యారు. జడ్జ్‌గా ఉన్న ఇంద్రజ అయితే నిజంగానే ఎమోషనల్ అయింది.

Krishna Bhagawan counters on Indraja in jabardasth latest promo

Krishna Bhagawan counters on Indraja in jabardasth latest promo

ఇది మా అదృష్టం అంటూ రాఘవను పొగిడేసింది. అయితే మాటల్లో మాటగా సూర్యకాంతం మా ఊరే అని కృష్ణ భగవాన్ అనేస్తాడు. ఏంటి మీరు ఆమె వచ్చిన ఊరు నుంచి వచ్చారా? అని ఇంద్రజ ఆశ్చర్యపోతోంది. ఆమె వచ్చిన ఊరు నుంచి వచ్చిన మీరు.. చేసేది ఇదేనా? అని అంటున్నారా? అని ఇంద్రజకు రివర్స్ కౌంటర్ వేస్తాడు కృష్ణ భగవాన్. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. కానీ ఈ స్కిట్, రాఘవ పర్ఫామెన్స్‌ను కృష్ణ భగవాన్ ఎంతో మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్కిట్టే ఎపిసోడ్‌కు హైలెట్ అయ్యేలా ఉంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp