Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తతో చిత్ర పరిశ్రమ శోకసంద్రం లోకి వెళ్లిపోయింది. ఆయన మృతి పట్ల సినిమా రంగ ప్రముఖులు మరియు అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ అని పిలవబడ్డ మొట్టమొదటి హీరో కృష్ణ. ప్రస్తుతం ప్రపంచంలో తెలుగు సినిమా రంగానికి మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ స్థాయికి టాలీవుడ్ వచ్చింది అంటే మొదట ఆద్యం పోసింది కృష్ణ అని చెప్పవచ్చు. హీరోగా కేవలం తన కెరీర్ గురించి మాత్రమే సినిమాలు చేయకుండా ఇండస్ట్రీ ఎదగాలని సినిమాలు చేసిన ఏకైక నటుడు… నటశేఖరుడు.. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ. టెక్నికల్ గా ఈరోజు తెలుగు సినిమా రంగం చాలా అభివృద్ధి చెందింది. అటువంటి టెక్నికల్ పరిజ్ఞానాన్ని తెలుగు సినిమాకి మొట్టమొదటిగా అందించింది సూపర్ స్టార్ కృష్ణ.
సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు తెలుగులో కలర్ సినిమా తీసుకొచ్చిన మొట్టమొదటి హీరో కూడా కృష్ణయే. దాదాపు తన 44 సంవత్సరాల సినీ ప్రస్థానంలో … ఏ హీరో బ్రేక్ చేయలేని అనేక రికార్డులు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో 44 సంవత్సరాలు పాటు విరామం లేకుండా నటించిన ఏకైక హీరో. సుమారు 350 కి పైగా సినిమాలలో హీరోగా నటించడం జరిగింది. 1983వ సంవత్సరంలో ఆయన నటించిన ఆరు సినిమాలు. విజయవాడలో 100 రోజుల వేడుకలు జరుపుకున్నాయి. ఒకే నగరంలో ఒకే ఏడాది ఆరు శత దినోత్సవ చిత్రాలు అందుకున్న హీరో ఇండియాలోనే ఎవరూ లేరు ఇది కృష్ణ సాధించిన సంచలన రికార్డు. ఇంకా 1972వ సంవత్సరంలో ఆయన నటించిన 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో 50 మల్టీస్టారర్ సినిమాలు చేసి.. ఎక్కువ మల్టీ స్టార్ సినిమాలు చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. కేఎస్ఆర్ దాస్ అనే డైరెక్టర్ తో దాదాపు 31 సినిమాలు చేయడం జరిగింది.
ఒకే దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా.. ఈ రీతిగా కృష్ణ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. తన 44 ఏళ్ల సినిమా ప్రస్థానంలో … 30 ఏళ్లు ప్రతి సంక్రాంతికి సినిమా విడుదల చేయడం జరిగింది. 105 మంది దర్శకులతో 52 మంది సంగీత దర్శకులతో కృష్ణ పని చేశారు. దాదాపు పాతిక సినిమాల్లో డబల్ పాత్రలో కనిపించగా, ఏడు సినిమాలలో ట్రిపుల్ రోల్ లో నటించడం జరిగింది. కృష్ణా నటించిన 20 సినిమాలు తమిళం లోకి 10 సినిమాలు హిందీలోకి అనువాదమయ్యాయి. ఇండస్ట్రీలో దాదాపు 80 మంది హీరోయిన్లతో నటించిన ఏకైక నటుడు హీరో కృష్ణ. అత్యధికంగా విజయనిర్మలతో 50 సినిమాలు చేయగా తర్వాత జయప్రదతో 45 ఇంకా శ్రీదేవితో 31 సినిమాలు చేశారు. తెలుగులో ఏ హీరోకి లేని రీతిలో కృష్ణకి 2500కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. ఎన్నో రికార్డులు మైలురాళ్లు అందుకున్న హీరోగా.. తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో సూపర్ స్టార్ కృష్ణ చెరగని ముద్ర వేసుకున్నారు.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.