Vijaya Nirmala and Indira Devi who is Superstar Krishna favorite
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త విని ఆయన అభిమానులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఆయన మరణాన్ని సినీ ఇండస్ట్రీతో పాటు కృష్ణ అభిమానులు, మహేశ్ బాబు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణ మృతితో ఒక్కసారిగి సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ ఇవాళ ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు గుండె పోటు రావడం వల్ల ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.
దీంతో కృష్ణ ఫ్యామిలీ శోకసంధ్రంలో మునిగిపోయింది. ఇక.. కృష్ణ అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ ఫ్యామిలీని మరణాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కృష్ణ ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు కృష్ణ కూడా చనిపోవడంతో కృష్ణ అభిమానులు చాలా బాధపడుతున్నారు. కృష్ణ పెద్దకొడుకు రమేశ్ బాబు చనిపోవడం అంతకుముందే కొన్నేళ్ల ముందు విజయ నిర్మల చనిపోవడం, ఇటీవల ఆయన మొదటి భార్య ఇందిరా దేవీ చనిపోవడంతో కృష్ణ చాలా కుంగిపోయారు. విజయనిర్మల చనిపోయినా కృష్ణ కోలుకున్నారు కానీ.. ఎప్పుడైతే ఇందిరా దేవీ చనిపోయారో ఇక కృష్ణ తట్టుకోలేకపోయారు. కృష్ణకు విజయనిర్మల కన్నా ఇందిరా దేవి అంటేనే ఇష్టం.
Vijaya Nirmala and Indira Devi who is Superstar Krishna favorite
దానికి కారణం.. ఆయన మొదటి భార్య కావడం, కోరుకొని పెళ్లి చేసుకోవడం. ఇందిరా దేవిని కృష్ణ ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ.. సినిమాల్లోకి వెళ్లాక విజయ నిర్మల మీద ఇష్టం పెంచుకున్నారు. విజయ నిర్మల మీద ఇష్టం పెంచుకొని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇందిరా దేవి మీద ఉన్న తన ఇష్టం, ప్రేమ మాత్రం తగ్గలేదు. విజయనిర్మల కన్నా కూడా కృష్ణకు ఇందిరా దేవి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె చనిపోయాకనే కృష్ణ మరింత కుంగిపోయారు. తనలో తానే బాధపడ్డారు. చాలా బాధపడ్డారు. అలా ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. చివరకు ఇందిరా దేవి చనిపోయిన కొన్ని రోజులకే ఆయన కూడా మంచం పట్టి తుదిశ్వాస విడిచారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.