Krishnam Raju : కృష్ణంరాజు డైరీ సీక్రెట్ రివీల్.. ప్రభాస్- అనుష్క పెళ్లి గురించి అలా రాసాడా..!

Authored By Sam C | The Telugu News | Updated on: November 20, 2022, 2:53 pm

Krishnam Raju : టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. 83 సంవత్సరాల వయసులో కాలం చేసిన కృష్ణం రాజు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. కృష్ణంరాజు భౌతిక కాయానికీ కృష్ణంరాజు తమ్ముడు పెద్ద కుమారుడు ప్రభాస్ అన్న ప్రభోద్ ఉప్పలపాటి దహన సంస్కారం చేసిన విష‌యం తెలిసిందే. ఇక కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఈయనకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే కృష్ణం రాజు తాను చ‌నిపోయే ముందు ప్ర‌భాస్ పెళ్లి చూడాల‌ని ఆయ‌న పిల్ల‌ల‌ని ఎత్తుకొని ఆడించాల‌ని క‌ల‌లు క‌న్నారు. అయితే ప్ర‌భాస్‌- అనుష్క‌ల రిలేష‌న్ గురించి కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా, వారు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్నారంటూ ప్ర‌చారాలు కూడా చేశారు. అయితే వారి పెళ్లి గురించి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా తన డైరీలో రాశారని సమాచారం అందుతోంది. త‌న‌కు అనుష్క ప‌ట్ల మంచి అభిప్రాయం ఉంద‌ని… ఆమె మంచి విలువ‌లు క‌లిగిన అమ్మాయి అని చాలా సంద‌ర్భాల్లో ఆమె పేరును త‌న డైరీలో ప్ర‌స్తావించార‌ని స‌మాచాం అందుతుంది. ఈ మాట‌ల‌ను బ‌ట్టే కృష్ణంరాజుకు వీరిద్ద‌రి పెళ్లి ఇష్ట‌మ‌న్న ప్ర‌చారం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

krishnam raju dairy secret revealed

krishnam raju dairy secret revealed

Krishnam Raju : ఇందులో నిజం ఉందా..!

ప్రభాస్ అనుష్క జోడీ బాగుంటుందని వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం ఎప్ప‌టి నుండో కోరుకుంటున్నారు. ప్రభాస్… అనుష్క తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని ఫ్యాన్స్ స‌ల‌హాలు కూడా ఇస్తున్నారు. కాని వారు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌భాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉంటే అనుష్క మాత్రం అప్పుడ‌ప్పుడు అలా ప‌ల‌క‌రిస్తుంది. కాగా, కృష్ణంరాజు ఆసుప‌త్రిలో ఉన్న‌ స‌మ‌యంలో అనుష్క హాస్పిట‌ల్‌కి వెళ్ల‌డంతో ప్ర‌భాస్- అనుష్క రిలేష‌న్‌పై ఎన్నో వార్త‌లు గుప్పుమ‌న్న విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp