Krishnam Raju : ప్రభాస్ – అనుష్కల పెళ్లి గురించి కృష్ణంరాజు తన డైరీలో ఏం రాసుకున్నారో చూడండి ..??

Advertisement

Krishnam Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్కల జోడి కి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు కానీ వారి నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. మా మధ్య అటువంటిది ఏమీ లేదని మేము కేవలం స్నేహితులం మాత్రమే అని అనుష్క ప్రభాస్ లు చాలాసార్లు చెప్పుకొచ్చారు. కానీ అభిమానులు మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రభాస్ అనుష్కలు కలిసి మిర్చి, బిల్లా, బాహుబలి సినిమాలు చేశారు. చూడడానికి వీళ్లిద్దరి జంట బాగుండడంతో ఈ జంట కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికైనా వాళ్లు పెళ్లి చేసుకుంటారు ఏమో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా ప్రభాస్ అనుష్కల గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి అందరికీ తెలిసిందే. ఆయన తన డైరీలో ప్రభాస్ అనుష్కల పెళ్లి గురించి రాసుకున్నారట. ఆయనకు ప్రభాస్ పిల్లలను ఎత్తుకొని ఆడించాలని కలలుకనే వారట. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లిపై అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక కృష్ణంరాజుకి అనుష్క పట్ల మంచి అభిప్రాయం ఉందని, ఆమె మంచి విలువలు కలిగిన అమ్మాయి అని చాలా సందర్భాలలో ఆమె పేరుని కూడా తన డైరీలో ప్రస్తావించారని సమాచారం.అయితే ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ప్రభాస్ అనుష్కల పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణంరాజు కూడా ప్రభాస్ అనుష్కలు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారట.

Advertisement
Prabhas Anushka marriage news in Krishnam Raju dairy
Prabhas Anushka marriage news in Krishnam Raju dairy

కానీ ప్రభాస్ అనుష్కలు పెళ్లి గురించి ఏం చెప్పడం లేదట. మా మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పుకొచ్చారట. అయినా ఫ్యాన్స్ మాత్రం స్నేహ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలని కోరుకుంటున్నారు. ఇక కృష్ణంరాజు అనారోగ్యానికి గురైనప్పుడు అనుష్క ఆస్పత్రికి వెళ్లడంతో ప్రభాస్ అనుష్క రిలేషన్షిప్ పై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ప్రభాస్ అనుష్కలు స్పందించ లేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అనుష్క అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తుంది.

Advertisement
Advertisement