Krishnaveni : సినిమా పరిశ్రమని బయట నుండి చూస్తే చాలా అమోఘంగా కనిపిస్తుంది. కాని అందులో ఉండే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బతుకు తెరువు కోసం నానా కష్టాలు పడి మంచి స్థాయికి ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తే ఎవరి సపోర్ట్ లేకుండా సొంత కష్టంతో మెగాస్టార్‌గా ఎదిగాడు. అయితే ఇటీవలి కాలంలో కొందరు నటీనటులు ఆలీతో సరదాగా షోతో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ లో తాము పడ్డ కష్ట గురించి తెలియజేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.తాజాగా ఓ నటి బతుకు తెరువు కోసం ఒకప్పుడు పనిమనిషిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు.. తెలుగు నటి కృష్ణవేణి.
వందల సినిమాల్లో మంచి పాత్రలు చేసిన ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూకు వచ్చిన కృష్ణవేణి మనసులో ఉన్న బాధనంతా బయటపెట్టింది. సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చినపుడే సంపాదించుకోవాలని.. అయితే చిన్న ఆర్టిస్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చింది ఈమె. సినిమా ఇండస్ట్రీకి వస్తే చాలా డబ్బులు సంపాదించొచ్చనే భ్రమ చాలా మందిలో ఉంటుంది. అదంతా అబద్ధం అని పేర్కింది.జీవితంలో ఎన్ని కష్టాలు పడినా కూడా ప్రస్తుతం మాత్రం చాలా సంతోషంగా ఉన్నామని తెలిపింది ఈమె. ఒకానొక సమయంలో పూట గడవడానికి కూడా కష్టం అయిందని..
అలాంటి సమయంలో అమెరికాలో ఓ 90 సంవత్సరాల పెద్ద మనిషి ఇంట్లో పని మనిషిగా కూడా పని చేశానని ఏడుస్తూ చెప్పుకొచ్చింది కృష్ణవేణి. ఇప్పుడు మాత్రం తనలైఫ్ సంతోషంగా ఉందని తెలియజేసింది. ఈమె చెల్లెలు రాగిణి మంచి నటి కాగా, మరో నటి రజిత కూడా కృష్ణవేణికి బంధువే. ఈమె స్వయానా అక్క కూతురు అవుతుంది. ఇలా కుటుంబం మొత్తం ఇండస్ట్రీకే వచ్చేసారు. ఏదేమైనా కూడా వందల సినిమాల్లో నటించిన తర్వాత కూడా పూట గడవడం కోసం పనిమనిషిలా మారడం మాత్రం దారుణమే పాపం అంటున్నారు సగటు సినీ అభిమానులు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.