mohan babu close to bjp
Mohan Babu : మోహన్ బాబు ఏ విషయం అయినా మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు మరియు ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తాను ఎక్కడ ఉన్నాను.. ఎవరితో ఉన్నాను.. ఏ స్టేజిపై ఉన్నాను అనే విషయాలను కూడా పట్టించుకోకుండా మోహన్ బాబు చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు విమర్శల పాలవుతునే ఉంటాయి. ఆ వ్యాఖ్యలు విమర్శల పాలు అవ్వడంతో పాటు ఆయన తీరును కూడా జనాలకు తెలియజేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే కోపం నీ దాచుకున్న వాడే గొప్పవాడు అవుతాడు. ఆ కోపం ని అప్పటికప్పుడు ప్రదర్శించడం కంటే కాస్త గ్యాప్ ఇచ్చి మరో చోట ప్రదర్శించడం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు ఉంటాయని.. ఎన్నో సమస్యలు ఆరంభం కాకుండానే ఉంటాయని పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.
మోహన్ బాబు పలు విషయాలలో అప్పటికప్పుడు స్పందించడం వల్ల చాలా సార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతున్నాడు ఆ సమయంలో అలీ జేబులో నుండి ఫోన్ తీసి చూశాడు. ఏదో ఫోన్ రావడంతో దాన్ని కట్ చేయడం కోసం ఫోన్ ను బయటకు తీశాడు అంతే కానీ ఫోన్ మాట్లాడింది కూడా లేదు. అయినా కూడా మోహన్ బాబు ఏకంగా స్టేజిపై ఉండి ఫోన్ మాట్లాడుతున్నావు కామన్ సెన్స్ ఉందా నీకు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతోటి దానికి కామన్ సెన్స్ ఉందా అంటూ అంత పెద్ద మాట వాడాల్సిన అవసరం లేదు. అందరి ముందు తన స్థాయి నటుడైనా అలీని అలా మాట్లాడిన మోహన్ బాబు కే కామన్సెన్స్ లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
mohan babu Serious comments on comedian ali
మోహన్ బాబు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు పలు సందర్భాల్లో చేశాడు. అందుకు ఆయనకు విమర్శలు తప్పలేదు. అయినా కూడా మళ్లీ అదే పద్ధతిని మోహన్ బాబు కొనసాగించడం ఈ విమర్శలకు తెర తీస్తోంది. అదే గొప్ప విషయం అన్నట్లుగా ఆయనకు ఆయన చెప్పుకుంటాడు. మొహం మీదే మాట్లాడేస్తాను. నేను ఏ విషయాన్ని కూడా దాచుకోను అంటూ గొప్పగా చెబుతాడు. స్టేజ్ పై లైవ్లో మోహన్ బాబు కామన్ సెన్స్ ఉందా అంటూ చేసిన వ్యాఖ్యలు అలీకి తీవ్రంగా ఇబ్బంది కలిగి ఉంటే ఉంటాయి. అందుకే అలీ ఆ సమయంలో వెంటనే మొహం మార్చేశాడు. దాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించినా కూడా మోహన్ బాబు మళ్లీ మళ్లీ పరువు తీసే అలాగే మాట్లాడాడు. ఇలాగే జరిగితే ముందు ముందు మోహన్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు కనీసం స్టేజ్ కూడా షేర్ చేసుకోరు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మంచు ఫ్యామిలీకి ఉన్న గోరోజనం కాస్త తగ్గించి ఉంటే బెటర్ అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.