krithi shetty dance video viral in internet
Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ దక్కింది. అందం, అభినయం, అదృష్టం ఇది రేర్ కాంబినేషన్. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. ఇరవై ఏళ్ళు నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది. ఇటీవల శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది.
అలాగే బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ రికార్డులకు ఎక్కింది.ఇక వరుసగా చిత్రాలకు సైన్ చేస్తున్న కృతి నెక్స్ట్ హీరో సుధీర్ కి జంటగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీలో నటిస్తున్నారు. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న బైలింగ్వెల్ మూవీ వారియర్ మూవీలో నటిస్తున్నారు. నితిన్ కి జంటగా మాచర్ల నియోజకవర్గం మూవీలో నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోను తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తమిళ్ పాపులర్ సాంగ్ అరబిక్ కుతుకి వీర లెవల్‌లో డ్యాన్స్ చేసింది. కృతి ఊపుడికి సోషల్ మీడియా షేక్ అవుతుంది. అమ్మడి అందచందాలకు ప్రతి ఒక్కరు ముగ్ధులు అవుతున్నారు.
krithi shetty dance video viral in internet
తమిళ స్టార్ విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. ఇటీవలె ఈ మూవీ నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 48గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఈ పాట ఇప్పుడు ఏకంగా 100మిలియన్ వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. రిలీజైన 4రోజుల్లోనే 50మిలియన్ వ్యూస్, వారం రోజుల్లోనే 70 మిలియన్ వ్యూస్, తాజాగా 12 రోజుల్లో 100మిలియన్ వ్యూస్‌ని దాటింది. హలమితి హబిబో అంటూ కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్యూన్ రీల్స్‌తో రచ్చ చేస్తున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.