shraddha kapoor breakup with her lover
Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ ..ఈ అమ్మడి గురించి ఎంత పొగిడిన తక్కువ. ఎప్పటికప్పుడు సన్నజాజి పువ్వులాంటి అందాలతో కనువిందు చేస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా `ఆషిఖి2` చిత్రంతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది శ్రద్ధా. ఈ రొమాంటికల్ మ్యూజికల్ డ్రామాలో శ్రద్ధా లవర్‌గా అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. ఘాటైన అందాలతో పిచ్చెక్కించింది. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్ యూత్‌ని తనవైపు తిప్పుకుంది శ్రద్ధా.
`ఏక్ విలన్`, `హైదర్`, `ఏబీసీడీ2` చిత్రాలతో శ్రద్ధా కపూర్ రేంజే మారిపోయింది. స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్‌ని తగిలించుకుంది. బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మరోవైపు `బాఘి` చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో జోడి కట్టి రియల్ లైఫ్‌లోనూ లవర్స్ గా మారిపోయారనే టాక్ వినిపించింది. కానీ అది నిజం కాదనే విషయాన్ని దిశా పటానీ ఎంట్రీతో క్లారిటీ వచ్చేసింది. నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది శ్రద్ధాకపూర్. అందుకు `హసీనా పార్కర్`, `స్త్రీ` చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఈ భామ `సాహో` చిత్రంలో నటించింది.
shraddha kapoor breakup with her lover
ఇటీవల `చిచ్చోర్`, `స్ట్రీట్ డాన్సర్ 3డీ`, `బాఘి3` చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. కానీ నెక్ట్స్ సినిమాల విషయంలో గ్యాప్ ఇచ్చింది శ్రద్ధా. ప్రస్తుతం ఆమె కేవలం లవ్ రంజన్ చిత్రంలో నటిస్తుంది. అయితే కొద్ది రోజులుగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన రోహన్ శ్రేష్ఠతో గత నాలుగేళ్ళుగా డేటింగ్‌లో ఉంది శ్రద్ధాకపూర్. ఇప్పుడు అతనికి బ్రేకప్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధా బర్త్ డే పార్టీలో రోహన్ ఎక్కడ కనిపించలేదు. దీనితో వీరిద్దరూ విడిపోయారన్న వార్తలకి బలం చేకూరుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలుస్తోంది.
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
This website uses cookies.