Krithi Shetty : ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగసిపడిన కృతి శెట్టి ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది. పారితోషికం పెంచినా డబ్బు వచ్చి పడేలా చేసింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ అనతి కాలంలో తారా స్థాయి నటీమణుల జాబితాలో చేరిపోతోంది.అటు సినిమాలతో అలరిస్తున్న కృతి శెట్టి.. ఇటు సోషల్ మీడియాలో అందాల విందుతో తన అభిమానులను ఫిదా చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో బిజీగా ఉంటున్న కుర్ర భామా సమయం ఉన్నప్పుడల్లా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
కెరియర్ మొదట్లో దూసుకుపోయిన కృతి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఆమె నటించిన సినిమాలు వరుస ఫ్లాపులుగా మారుతున్నాయి. రామ్, నితిన్‌తో చేసిన ”ది వారియర్ ” మాచర్ల నియోజకవర్గం” సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అంతేకాదు దీంతో కృతి శెట్టి రేంజ్ కూడా దిగిపోయింది. కాగా ఇప్పుడు అందరి కళ్ళు ఆమె నటిస్తున్న తర్వాత చిత్రం..” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా పైనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిందని కొందరు చెబుతున్నారు. ఇందులో కృతి పర్‌ఫార్మెన్స్ చూసిన తండ్రి ..” నీలో రాను రాను నటనపై ఆసక్తి తగ్గిపోతుంది ..ఇలాగే అయితే నీకు సినిమా ఇండస్ట్రీల అవకాశాలు రావు . నువ్వు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలంటే కష్టపడాలి” అంటూ ఆమెను వార్న్ చేశాడట. ప్రస్తుతం ఇదే విషయం కన్నడ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అది అలా ఉంటే ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రత్యేక పూజాలు చేస్తున్నాట. కృతిశెట్టి, ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ కృతిశెట్టి మొదటి సినిమా ఉప్పెన ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.