Krithi Shetty : కృతికి తొంద‌రెక్కువైందా.. ఫాద‌ర్ వార్నింగ్‌కు చ‌ల్ల‌బ‌డ్డ బేబ‌మ్మ‌..!

Authored By Sam C | The Telugu News | Published on: September 7, 2022, 12:00 pm

Krithi Shetty : ఒకే ఒక్క సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగసిపడిన కృతి శెట్టి ఈ సినిమా త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంది. పారితోషికం పెంచినా డబ్బు వచ్చి పడేలా చేసింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ అనతి కాలంలో తారా స్థాయి నటీమణుల జాబితాలో చేరిపోతోంది.అటు సినిమాలతో అలరిస్తున్న కృతి శెట్టి.. ఇటు సోషల్ మీడియాలో అందాల విందుతో తన అభిమానులను ఫిదా చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో బిజీగా ఉంటున్న కుర్ర భామా సమయం ఉన్నప్పుడల్లా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.

Krithi Shetty : కృతికి స్వీట్ వార్నింగ్..

కెరియ‌ర్ మొద‌ట్లో దూసుకుపోయిన కృతి ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఆమె న‌టించిన సినిమాలు వ‌రుస ఫ్లాపులుగా మారుతున్నాయి. రామ్, నితిన్‌తో చేసిన ”ది వారియర్ ” మాచర్ల నియోజకవర్గం” సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అంతేకాదు దీంతో కృతి శెట్టి రేంజ్ కూడా దిగిపోయింది. కాగా ఇప్పుడు అందరి కళ్ళు ఆమె నటిస్తున్న తర్వాత చిత్రం..” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా పైనే ఉన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ కూడా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇందులో కృతి ప‌ర్‌ఫార్మెన్స్ చూసిన‌ తండ్రి ..” నీలో రాను రాను నటనపై ఆసక్తి తగ్గిపోతుంది ..ఇలాగే అయితే నీకు సినిమా ఇండస్ట్రీల అవకాశాలు రావు . నువ్వు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలంటే కష్టపడాలి” అంటూ ఆమెను వార్న్ చేశాడట. ప్రస్తుతం ఇదే విషయం క‌న్న‌డ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

krithi shetty Father fire on her daughter krithi shetty

krithi shetty Father fire on her daughter krithi shetty

అది అలా ఉంటే ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రత్యేక పూజాలు చేస్తున్నాట. కృతిశెట్టి, ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ కృతిశెట్టి మొదటి సినిమా ఉప్పెన ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp