Krithi shetty : బెడ్డు మీద బేబమ్మ.. సెగలు పుట్టించిన కృతి శెట్టి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Krithi shetty : బెడ్డు మీద బేబమ్మ.. సెగలు పుట్టించిన కృతి శెట్టి

 Authored By prabhas | The Telugu News | Updated on :22 November 2021,2:45 pm

Krithi shetty : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసింది కృతి శెట్టి. ఈ మధ్య కాలంలో ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మరొకరు ఉండరు. మొదటి చిత్రమైన ఉప్పెన రిలీజ్ కాకముందే బేబమ్మకు ఫుల్ డిమాండ్, క్రేజ్ వచ్చింది. అప్పటికే రెండు మూడు సినిమాల్లో కృతి శెట్టిని తీసుకున్నారు. ముందే బుక్ చేసుకోండి.. ఆ తరువాత దొరకదు అంటూ చిరంజీవి సైతం అందరి ముందే చెప్పేశాడు. చిరు చెప్పినట్టుగానే వ్యవహారం మారింది.

కృతి శెట్టికి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కుర్ర హీరోలందరి మొదటి చాయిస్‌గా నిలుస్తోంది. అందుకే ఇప్పుడు నాని, సుధీర్ బాబు, నాగ చైతన్య, రామ్ వంటి వారు కృతి శెట్టిని వదలడం లేదు. మొత్తానికి కృతి ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. ఒకపక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా నెట్టింట్లో మాత్రం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. హాటు, ఘాటు, నాటు అంటూ దుమ్ములేచిపోయేలా పోజులతో పిచ్చెక్కిస్తోంది.

Krithi shetty Latest pHotoshoot Viral

Krithi shetty Latest pHotoshoot Viral

Krithi shetty : హాటు ఫోటోలతో కృతి శెట్టి రచ్చ..

కృతి శెట్టి ప్రస్తుతం మైసూర్‌లో ఉంది. బంగార్రాజు షూటింగ్‌లో కృతి ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. బెడ్డు మీద అలా పడుకుంది. కైపెక్కించేలా కళ్లతోనే మాయ చేసేస్తోంది. అలా బెడ్డు మీద బేబమ్మను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం కృ‌తి శెట్టి ఫోటోలను నెటిజన్లు కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు. ఆ ఫోటోలకు రోహిణిని కూడా కామెంట్ చేసింది. మంటపెడుతున్నావ్ అన్నట్టుగా కామెంట్ చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది