Krithi Shetty – Sreeleela : గ్లామర్‌తో క్యాష్ చేసుకుంటున్న క్రేజీ బ్యూటీస్..

Advertisement

Krithi Shetty – Sreeleela : ఇప్పుడు టాలీవుడ్‌లో రష్మిక మందన్న, పూజా హెగ్డేల కంటే కూడా ఎక్కువగా వినిపిస్తుందీ యంగ్ బ్యూటీస్ ఉప్పెన కృతిశెట్టి, పెళ్ళి సందడి బ్యూటీ శ్రీలీల. వీరిద్దరికీ కెరీర్‌లో హీరోయిన్‌గా అవకాశాలు రావడం అంత ఈజీగా జరగలేదు. కృతి శెట్టి ఒక్క ఛాన్స్ ..నేనేంటో చూపిస్తా అంటూ చాలామందిని రిక్వెస్ట్ చేసిందట. కానీ, ముందు ఈ కుర్రభామను అంతగా మేకర్స్ పట్టించుకోలేదు. కానీ, అదృష్టం కొద్దీ ఏకంగా మెగా హీరో సినిమా ఉప్పెనలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అందరిని దృష్టిని తన అందంతో ఆకట్టుకుంది.

ఇండస్ట్రీకి ఓ కొత్త అమ్మాయి వచ్చిందంటే మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్‌కు దర్శకనిర్మాతలు వెళ్ళి కలవడం సజహంగా చేస్తుంటారు. అలా ముందు బంగారాజు సినిమా దర్శకుడు, శ్యామ్మ్ సింగరాయ్ చిత్ర దర్శకుడు, రామ్ నటిస్తున్న ది వారియర్ దర్శకుడు ఎన్.లింగుస్వామీ కలిశారు. అందరికీ కృతి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వెంటనే డేట్స్ బ్లాక్ చేసుకున్నారు. అలా ఒకేసారి మొదటి సినిమా రిలీజ్ కాకుండానే నాలుగు సినిమాలకు సైన్ చేసింది. ఆ తర్వాత మరో మూడు సినిమాలకు సైన్ చేసి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మొత్తం 8 సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి.

Advertisement
 Krithi Shetty Sreeleela Crazy beauties on glamor
Krithi Shetty Sreeleela Crazy beauties on glamor

Krithi Shetty – Sreeleela : రెమ్యునరేషన్ 1 కోటి దాటేసింది.

ఇక శ్రీలీల అంటే దర్శకేంద్రుడి స్టాంప్. ఆయన సినిమాలో నటించిందంటే పర్ఫార్మెన్స్ కంటే కూడా గ్లామర్‌తోనే ఆకట్టుకుంటుంది. అదే శ్రీలీల చేసింది. లేలేత పరువాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ బెంగుళూరు బ్యూటీ అటు కన్నడలో కూడా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. చెపాలంటే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అద్భుతమైన పర్ఫార్మర్స్ అని చెప్పడానికి లేదు. కానీ, ఒకే అనుకోవచ్చు. అయితే, ఎక్కువగా తమ గ్లామర్, అందచందాలతోనే అవకాశాలు దక్కించుకుంటున్నారు. లాంటి బ్యూటీలు గనక పూరి జగన్నాథ్ సినిమాలో పడితే అసలు గ్లామర్ ట్రీట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యూటీల కోసం స్టార్ హీరోలు బాగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే వీరి రెమ్యునరేషన్ 1 కోటి దాటేసింది.

Advertisement
Advertisement