MS Raju : స్టార్ దర్శకనిర్మాత ఎంత ఆ సినిమా తీసినా గట్టెక్కలేకపోతున్నారే..?
MS Raju : టాలీవుడ్‌లో ఒకప్పుడు నిర్మాత ఎం ఎస్ రాజు అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. క్లియర్‌గా అర్థమవ్వాలంటే ఇప్పుడు దిల్ రాజు సంస్థ నుంచి సినిమా వస్తుందంటే అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో ఎలాంటి క్రేజ్ ఉండేదో అలాంటి క్రేజ్ అప్పుడు ఎం ఎస్ రాజు నుంచి సినిమా వస్తుందంటే ఉండేది. విక్టరీ వెంకటేష్ – విజయ శాంతి జంటగా ఎం ఎస్ రాజు మొదటి సినిమాగా శత్రువు నిర్మించారు. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్ సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలను నిర్మాతగా సక్సెస్ ఇచ్చాయి. ఇక దేవీ చిత్రం ఎంఎస్ రాజు నిర్మాణ సంస్థను గట్టిగా నిలబెట్టింది.
ఈ సినిమాతో ఆయన భారీ లాభాలను చూశారు. ఈ క్రమంలో దేవీ పుత్రుడు, మనసంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు, వర్షం లాంటి సినిమాలతో అగ్ర నిర్మాతగా మారారు. రాజు గారికి స్క్రీన్ ప్లే మీద మంచి పట్టుంది. అదే ఆయన సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా భారీ సక్సెస్ తర్వాత నిర్మించిన పౌర్ణమి బాగా నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత అందరూ రాంగ్ స్టెప్ వేస్తున్నారు అని చెప్పినా వినకుండా స్వీయ దర్శకత్వంలో వాన సినిమాను డైరెక్షన్ తో పాటు నిర్మించి ఇంకా ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారు. చివరిగా మస్కా సినిమా చేసి చాలా ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
MS Raju : ఇలాంటి సినిమాలను కోరుకోవడం లేదు.
మళ్ళీ తూనీగ తూనీగ, సినిమా తీసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. డర్టీ హరి, తాజాగా వచ్చిన 7 డేస్ 6 నైట్స్ చిత్రాలకు సొంతగా దర్శకత్వం వహించి నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ కాస్త కంటెంట్‌ను ఎన్నుకుంటున్నారు. కానీ, ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో ఎం ఎస్ రాజు సంస్థ
అంటే ఓ నమ్మకం. ఆయన నుంచి ఇలాంటి సినిమాలను కోరుకోవడం లేదు. అదే రాజు గారికి సక్సెస్ రాకుండా చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ ఆయన అద్భుతమైన కథను ఎంచుకొని నిర్మాతగా సినిమాను సక్సెస్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.