Ashu Reddy : తాగుబోతులు, తిరుగుబోతుల్లా మారిపోయారా?.. అషూ, అజయ్, స్రవంతి వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : తాగుబోతులు, తిరుగుబోతుల్లా మారిపోయారా?.. అషూ, అజయ్, స్రవంతి వీడియో వైరల్

Ashu Reddy : బిగ్ బాస్ ఓటీటీ ద్వారా కొంత మంది కంటెస్టెంట్లకు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ అనేది ఓటీటీలో రావడంతో అంతగా క్లిక్ అవ్వలేదు. కంటెస్టెంట్లకు కూడా అంతగా కలిసి రాలేదు. మొత్తానికి ఈ 24 గంటల ప్రసారం అనే కాన్సెప్ట్ జనాలకు అంతగా ఎక్కలేదు. అసలు ఈ సీజన్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మొదటి సీజన్ కంటెస్టెంట్లలో కొంత మంది మాత్రం పర్వాలేదనిపించారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,8:30 pm

Ashu Reddy : బిగ్ బాస్ ఓటీటీ ద్వారా కొంత మంది కంటెస్టెంట్లకు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ అనేది ఓటీటీలో రావడంతో అంతగా క్లిక్ అవ్వలేదు. కంటెస్టెంట్లకు కూడా అంతగా కలిసి రాలేదు. మొత్తానికి ఈ 24 గంటల ప్రసారం అనే కాన్సెప్ట్ జనాలకు అంతగా ఎక్కలేదు. అసలు ఈ సీజన్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మొదటి సీజన్ కంటెస్టెంట్లలో కొంత మంది మాత్రం పర్వాలేదనిపించారు. ఇంకొంత మంది మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. అందులో స్రవంతి చొక్కారపు కూడా ఉంది. ఆమె వస్త్రాధారణ, బిగ్ బాస్ ఇంట్లో ఉన్న విధానం, ఆ తీరు అన్నీ కూడా ట్రోలింగ్‌‌కు గురయ్యాయి.

అయితే అజయ్, స్రవంతి, అఖిల్ త్రయం మాత్రం మంచి బాండింగ్‌తో ముందుకు పోయింది. అజయ్, అషూ రెడ్డిల స్నేహం కూడా క్లిక్ అయింది. అయితే అషూ రెడ్డికి అఖిల్ మీదున్నది మాత్రం ఏంటన్నది క్లారిటీ లేకుండా పోయింది. మొత్తానికి ఈ మొదటి సీజన్ ముగిసింది. బిందు మాధవి విన్నర్ అయింది.. అఖిల్ మళ్లీ రన్నర్‌గానే మిగిలిపోయాడు. అయితే ఇప్పుడు అజయ్, అషూ, స్రవంతి కలిసి చేస్తోన్న రచ్చకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అజయ్, అషూ స్నేహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

Ashu Reddy Sravanthi Chokarapu And Ajay Enjoys in Beach

Ashu Reddy Sravanthi Chokarapu And Ajay Enjoys in Beach

అయితే ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి బీచుల్లో చేస్తోన్న రచ్చ వైరల్ అవుతోంది. చూస్తుంటే వీరంతా కూడా గోవాకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక గోవా వీధుల్లో వీరు చేసిన అల్లరికి సంబంధించిన ఓ రీల్ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఈ రీల్ వీడియోను అషూ రెడ్డి షేర్ చేసింది. ఇందులో అషూ, స్రవంతి ఇద్దరూ కూడా బీరు తాగినట్టు కనిపిస్తోంది. అలా తాగుబోతులు, తిరుగుబోతుల్లా ఈ రీల్ వీడియోలో కనిపించారు. మొత్తానికి ఈ వీడియో మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలానే బాగా తాగండి.. డ్రైవ్ చేయండి.. అమాయకులను చంపేయండని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది