Krithi Shetty : ఉప్పెన సినిమాకి కృతిశెట్టి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటున్నారు..!!
Krithi Shetty : బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా తో హీరోగా మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే ఉత్తరాది ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది. అంతకు ముందు ఈ అమ్మడు కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కనిపించడంతో పాటు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఒక కమర్షియల్ యాడ్ లో ఈమెను చూసి బుచ్చిబాబు ఎంపిక చేయడం జరిగిందట. ఉప్పెన సినిమా లో ఆమె అద్భుతంగా నటించింది. అంతే కాకుండా రొమాంటిక్ సాంగ్స్, సన్నివేశంలో కూడా అలరించింది.
Krithi Shetty uppena movie remuneration very low
హాట్ గా నటించింది కనుకే ఈమెకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. ఉప్పెన సినిమా తో అద్భుతమైన పాపులారిటీని సొంతం చేసుకున్న కృతి శెట్టి రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా నష్ట పోయిందట. మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ సినిమా ను నిర్మించారు. ముందస్తు ఒప్పందం ప్రకారం కృతి శెట్టి కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే పారితోషికంగా ఇచ్చి.. మరో 10 లక్షల రూపాయలు ఆమెకు ఖర్చుల నిమిత్తం ఇచ్చారట. అంటే ఆమెకు నెలకు రెండు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ని మైత్రి మూవీస్ వారు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Krithi Shetty uppena movie remuneration very low
రెమ్యూనరేషన్ తక్కువగా వచ్చినా కూడా ఉప్పెన సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ లభించింది. ఆ సినిమా సక్సెస్ అవడంతో ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క రెమ్యూనరేషన్ కోటికి పైగానే ఉంది అనే విషయం తెలిసిందే. ఈ మధ్య ఒక యంగ్ హీరోతో ఈమె నటించేందుకు ఓకే చెప్పింది. ఆ సినిమాలో నటించేందుకు గాను కృతి శెట్టి ఏకంగా కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకు ఉంటుందట. అంతే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడికి ఆఫర్లు తలుపు తడుతున్నాయి. అందుకే మొదటి ఆఫర్ ఏంటి ఎలా ఉంటుంది అనేది చూడకుండా కమిట్ అయ్యి చేసుకుంటే వెళ్లడమే ఉత్తమమైన మార్గం.
