
Akhil : అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ సినిమాని జూన్ 19 న రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ 5 సెట్స్ మీదకి రాబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సైరా తర్వాత సురేందర్ రెడ్డి దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్నాడు. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశాడు.
kriti-shetty-in-akhil-5-is-it-only-for-craze
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు సురేందర్ రెడ్డి. రాం తాళ్ళూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడని సమాచారం. అలాగే మరో ప్రాజెక్ట్ అఖిల్ అక్కినేని తో చేస్తున్నాడు. ఈ సినిమా అఖిల్ కెరీర్ లో 5 వ సినిమా కాగా సురేందర్ రెడ్డి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తో కలిసి సురేందర్ రెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహించబోతున్నాడు.
Akhil : ఆ క్రేజ్ అఖిల్ 5 కి బాగా ప్లస్ అవుతుందన్న లాజిక్ తో కృతి శెట్టి ని ఎంచుకున్నారట..!
అంతేకాదు ఇప్పటి వరకు అఖిల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే సినిమా ఒక్కటి కూడా లేదు. దాంతో అఖిల్ 5 ని సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని చెప్పుకుంటున్నారు. కథ కూడా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుందని చెప్పుకుంటున్నారు. సురేందర్ రెడ్డి కెరీర్ లో రేసుగుర్రం..ధృవ లాంటి భారీ సక్సస్ లు ఉన్నాయి. ఇప్పుడు అఖిల్ సినిమాని అదే తరహా కథాంశం తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతి శెట్టి ని తీసుకోవాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కృతి శెట్టి కి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ అఖిల్ 5 కి బాగా ప్లస్ అవుతుందన్న లాజిక్ తో కృతి శెట్టి ని ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.