
Nithin : నితిన్ చెక్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. యూత్ స్టార్ నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో హిట్ కొట్టి ఫాం లోకి వచ్చాడు. అయితే బీష్మ తర్వాత వరసగా నాలుగు సినిమాలని లైనప్ చేసి పెట్టుకున్నాడు కాని కరోనా కారణంగా ఆ సినిమాలన్నిటికి బ్రేక్ పడింది. కాగా నెల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చెక్, రంగ్ దే ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి.
వాస్తవంగా రంగ్ దే సినిమా ముందు రిలీజ్ కావాల్సి ఉండగా కొంత టాకీ పార్ట్ మళ్ళీ రీ షూట్ చేయడం తో ఈ సినిమా కంటే ముందు చెక్ రిలీజ్ అవుతోంది. కాగా ఈ సినిమా గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి – నితిన్ కాంబినేషన్ లో వస్తున్న థ్రిల్లర్ సినిమా ఇప్పటికే మంచి బిజినెస్ కూడా జరిగిందని టాక్ వస్తోంది. టాలీవుడ్ లో చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే నితిన్ నటించిన చెక్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్.
అయితే నితిన్ మీద ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు. ప్రియా ప్రకాష్ కి టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ సినిమా. ఇక గత కొంతకాలంగా రకుల్ టాలీవుడ్ లో సక్సస్ కోసం ఎదురు చూస్తోంది. అందుకే ఈ సినిమా మీద ఈ ఇద్దరి బ్యూటీలు ఆశలన్ని ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ చెక్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో మరికొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన కృతి శెట్టి లాంటి ముగ్గురు, నలుగురు యంగ్ బ్యూటీస్ పోటీగా ఉన్నారు. చూడాలి మరి వాళ్ళని తట్టుకొని ప్రియా ప్రకాష్ నిలబడుతుందా లేదా. కాగా చెక్ ఈ నెల 19 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.