kubera Movie Review : ధనుష్, నాగార్జున కుబేర మూవీ పబ్లిక్ టాక్.. సినిమా ఎలా ఉంది..?
kubera Movie Review : ఈరోజు భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా, రష్మిక కథానాయికగా కనిపించి అలరించనుంది. ఈ సినిమా నేడు థియేటర్స్‌లోకి రాగా, కొందరు తమ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. మెజారిటీ ఆడియెన్స్ నుంచి కుబేరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ధనుష్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, నాగార్జున అథెంటిక్ రోల్‌లో అదరగొట్టారని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
kubera Movie Review : ధనుష్, నాగార్జున కుబేర మూవీ పబ్లిక్ టాక్.. సినిమా ఎలా ఉంది..?
శేఖర్ కమ్ముల రచన మరియు దర్శకత్వం, డీఎస్పీ అందించిన నేపథ్య సంగీతం అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల కథ చెప్పే విధానం ఆకర్షణీయంగా ఉందంటున్నారు.రష్మిక తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే పాత్రలో నటించిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదే విధంగా సెకండ్ హాఫ్ లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతాయని.. సినిమాను కచ్చితంగా చూడమంటూ రికమండ్ చేస్తున్నారు. అయితే ప్రతి సినిమా మాదిరిగానే కుబేర కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.
ముఖ్యంగా కథనం వేగం కొంచెం సాగదీసినట్లు అనిపించిందని.. 2 గంటల్లో చెప్పగలిగే కథను 3 గంటలకు లాగారని మూవీ లవర్స్ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు. మొత్తంగా పబ్లిక్ టాక్ చూస్తుంటే కుబేర హిట్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తంగా నాగార్జున, ధనుశ్ కాంబో వర్కౌట్ అయినట్టే చెబుతున్నారు. కొన్ని చోట్ల శేఖర్ కమ్ముల రొటిన్ సినిమా తీసాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మిక్స్ డ్ టాక్ తో ‘కుబేర’ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.