Chiranjeevi : చిరంజీవి, నాగ చైతన్య శ్రమ బూడిదలో పోసిన పన్నీరు పాపం

Authored By aruna | The Telugu News | Published on: August 20, 2022, 12:40 pm

Chiranjeevi – Naga Chaitanya : బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ నటించిన లాల్ సింగ్ చడ్డా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు లో ఈ సినిమా ను ప్రమోట్‌ చేయడం కోసం చాలా నే ఖర్చు పెట్టారు. దాదాపుగా మూడు కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల ప్రమోషన్ కోసం యూనిట్‌ సభ్యులు ఖర్చు చేశారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. పై గా ఈ సినిమా కు మెగా స్టార్ చిరంజీవి యొక్క సమర్పణ సినిమా పై అంచనాలు పెంచింది అనడం లో సందేహం లేదు. కాని చిరంజీవి పేరు సినిమా కు కనీసం వర్కౌట్‌ అవ్వలేదు.

వసూళ్ల విషయం లో లాల్‌ సింగ్ చడ్డా యొక్క లెక్కలు అందరిని ఆశ్చర్యంకు గురి చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో కనీసం కోటి రూపాయల షేర్ ను ఈ సినిమా రాబట్టలేక పోవడంతో అసలు చిరంజీవి ఏం చేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి వల్ల సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశించారు. కాని సినిమా విడుదల సమయంలో చిరంజీవి పేరు వల్ల హడావుడి చేసింది కాని విడుదల తర్వాత మాత్రం పెద్దగా వసూళ్లు సాధించలేక పోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

laal singh chaddha movie no use of chiranjeevi and naga chaitanya

laal singh chaddha movie no use of chiranjeevi and naga chaitanya

లాల్ సింగ్ చడ్డా సినిమా లో నాగ చైతన్య నటించినా కూడా పెద్దగా ఫలితం లేదు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి నాగ చైతన్య మరియు చిరంజీవి ల వల్ల లాల్ సింగ్ చడ్డా సినిమా కు ఎంత వరకు ప్రయోజనం చేకూరింది అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చింది. సినిమా లో కంటెంట్ లేకుంటే చిరంజీవి కాదు మరెవ్వరు ఉన్నా కూడా వర్కౌట్ అవ్వడం అసాధ్యం అని లాల్ సింగ్ చడ్డా తో తేలిపోయింది. నాగ చైతన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కాని ఇప్పటి వరకు నాగ చైతన్యకు అక్కడ కనీసం గుర్తింపు దక్కలేదు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp