Ashu Reddy : అడ్డంగా దొరికేసిందిగా.. ఆషూ రెడ్డి ఇక నీ ఖేల్ ఖతం..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 27, 2023, 4:40 pm

Ashu Reddy : అషూ రెడ్డి కంటే కూడా జూనియర్ సమంతగా బాగా ఫేమస్ అయింది. అలాగే బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ తన సత్తా చాటుతున్న అషూ రెడ్డి ఎప్పుడైతే డేరింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల్లో పడిందో అప్పటి నుంచి తన రేంజే మారిపోయింది. ఇప్పుడు తను సెలబ్రిటీ. స్టార్ హీరోయిన్లకు కూడా ఏమాత్రం తగ్గని రేంజ్ తనది. ఆర్జీవీ బ్యూటీ అని ముద్ర వేయించుకోవడంతో తను క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. వర్మతో ఇంటర్వ్యూలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ. మరోవైపు బుల్లి తెర మీద కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది ఈ భామ.

ఇది వరకు పలు షోలలో యాంకర్ గా, కంటెస్టెంట్ గానూ చేసింది. కొన్ని షోలకు జడ్జిగానూ చేసిన అషూ రెడ్డి సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఆ మధ్య పటాస్ హరితో లవ్ ట్రాక్ కూడా నడిపింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉండే అషూ రెడ్డి ఇన్ స్టాలో పలు రీల్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా తను చేసిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది డబ్ స్మాష్ టైప్ వీడియో.

ladies trolling ashu reddy with that video

ladies trolling ashu reddy with that video

Ashu Reddy : నిత్యా మీనన్ డైలాగ్ ను దింపేసిందిగా

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని డైలాగ్ అది. ఆ సినిమాలో నిత్యామీనన్ చెప్పే డైలాగ్ మామూలుగా ఉండదు. నాకు పెళ్లయితే వారంలోపే నా మొగుడిని కాఫీలో విషం పెట్టి చంపేస్తా అనే డైలాగ్ ఉంటుంది. అది అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ డైలాగ్ నే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి దింపేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో.. నువ్వు నిజంగానే నీ మొగుడిని చంపేసేలా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp