Manchu Lakshmi : ఒక్కసారిగా మనోజ్ చూసి కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. వీడియో
ప్రధానాంశాలు:
Manchu Lakshmi : ఒక్కసారిగా మనోజ్ చూసి కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి
Manchu Lakshmi : హైదరాబాద్‌లో ప్రతి ఏడాది నిర్వహించే సెలబ్రిటీ ఫ్యాషన్ షో ఈసారి కూడా ఘనంగా సాగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఫ్యాషన్ షోలో నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక హాజరయ్యారు. అనుకోకుండా తన సోదరుడు మనోజ్‌ను వేదికపై చూసిన మంచు లక్ష్మి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

Manchu Lakshmi : ఒక్కసారిగా మనోజ్ చూసి కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. వీడియో
Manchu Lakshmi : లక్ష్మి షాక్ ఇచ్చిన మనోజ్.. దెబ్బకు ఏడ్చేసిన లక్ష్మి
ఒక్కసారిగా మనోజ్ ను పట్టుకొని కన్నీరు పెట్టుకుంది. ఇంత కాలంగా వచ్చిన గ్యాప్ తర్వాత సోదరుడిని పబ్లిక్ ఈవెంట్‌లో ప్రత్యక్షంగా చూడడం ఆమెను భావోద్వేగానికి గురి చేసినట్టు కనిపించింది. పక్కనే ఉన్న మౌనిక లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొద్దీ రోజులుగా మంచు ఫ్యామిలీ లో ఆస్థి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విష్ణు – మనోజ్ మధ్య తారాస్థాయికి చేరింది గొడవ. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం , పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టేవరకు వెళ్ళింది. ఈ క్రమంలో మనోజ్ ను చూసి లక్ష్మి కన్నీరు పెట్టుకుంది.
మనోజ్‌ని చూసి మంచు లక్ష్మి ఎమోషనల్
హైదరాబాద్ వేదికగా ప్రతి ఏడాది సెలబ్రిటీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తుంటారు. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో తన సోదరిని సర్ప్రైజ్ చేస్తూ నటుడు మనోజ్ ఆయన సతీమణి మౌనిక పాల్గొన్నారు. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. ఆయన్ని ప్రేమగా… pic.twitter.com/BtrD4vDLEq
— ChotaNews App (@ChotaNewsApp) April 13, 2025