Lavanya – Raj Tarun : ఇదెక్క‌డి ట్విస్ట్ రా మామ‌.. రాజ్ త‌రుణ్ నా కొద్దు అంటూ తేల్చేసిన లావ‌ణ్య‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lavanya – Raj Tarun : ఇదెక్క‌డి ట్విస్ట్ రా మామ‌.. రాజ్ త‌రుణ్ నా కొద్దు అంటూ తేల్చేసిన లావ‌ణ్య‌

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2024,1:00 pm

Lavanya – Raj Tarun ; రాజ్ త‌రుణ్‌, లావ‌ణ్య‌ల ప్రేమ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మార‌డం మ‌నం చూశాం. ఇద్ద‌రు ఒకరిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మీడియాకి మంచి స్ట‌ఫ్ ఇస్తున్నారు. దాదాపు దశాబ్దం పైగా వీళ్ళిద్దరూ సహజీవనం చేశాన‌ని, ఆమెతో శారీరకంగా సంబంధం ఉన్న మాట వాస్తవమే అని రాజ్ తరుణ్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు. అయితే కొందరి వల్ల రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ తరుణ్ ను వదలను అని చెప్పుకొచ్చిన లావ‌ణ్య‌ ఇప్పుడు ఊహించిన విధంగా రాజ్ తరుణ్ నాకు అవసరం లేదు అంటూ ఆమె మరో వివరణ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Lavanya – Raj Tarun : ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..

ఇన్ని రోజులు నాకు సాయం దొరుకుతుంద‌ని నేను నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌రిగిన విష‌యాల‌ని బ‌య‌ట‌కి తెచ్చాను. ఏ రోజు రాజ్ త‌రుణ్ గురించి నేను బ్యాడ్‌గా మాట్లాడింది లేదు. ఇప్పుడు అతను నాతో ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు, పెళ్లి చేసుకోలేదు అని అంటున్నాడు. ఇక అన్ని మాటలు మాట్లాడిన తర్వాత నేను కూడా అతన్ని వద్దని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు అతని కోసం నేను పోరాడింది నిజమే కానీ ఇప్పుడు వద్దని అనుకుంటున్నాను అంటూ లావ‌ణ్య తేల్చేసింది. ఇక నాతో ఇన్నాళ్లు ఆయ‌న క‌లిసి ఉన్నాడంటే అది అత్యాచారం కింద‌కే వ‌స్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే నాపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు కూడా పెట్టారు. అసలు నా వల్ల వాళ్లకు ప్రాణహాని ఉంది అని అంటున్నారు.

నేను కేవలం ఒక క్లారిటీ కోసం మాత్రమే వెళ్లాను. ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. అతనితో పదేళ్లు ఉన్నాను కాబట్టి ఒక సమాధానం కోసం మాత్రమే నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. దానికి బదులుగా వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారు. రాజ్ తరుణ్ నాతో పదేళ్లు ఉన్నాడు. కాబట్టి అతన్ని నేను కావాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు అతనే నన్ను వద్దు అనుకుంటున్నాడు కాబట్టి బలవంతంగా నేను అతన్ని నా దగ్గరకు తీసుకురావాలని అనుకోవడం లేదు. అతను లేడని ఫొటోకు దండ వేసుకొని బ్రతికేస్తా. అయితే నాకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం మాత్రం జరగాలని కోరుకుంటున్నాను.. అని లావణ్య వివరణ ఇచ్చారు. మ‌రోవైపు రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రైవేట్ గా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో బయట పెట్టింది లావ‌ణ్య‌. ఆమె ఇద్ద‌రి లోకం ఒక‌టే హీరోయిన్ అని చెప్పుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది