Raj Tarun : రాజ్ త‌రుణ్ బండారం బ‌య‌ట‌ప‌డింది.. మాల్వీతో చాట్ లీక్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 20 July 2024, 10:00 am

Raj Tarun : యంగ్ హీరో రాజ్ త‌రుణ్ త‌న‌ని మోసం చేశాడంటూ లావ‌ణ్య అనే యువ‌తి కొద్ది రోజులుగా ఫైట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌, తాను 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. ఇద్దరు గుడిలో వివాహం కూడా చేసుకున్నామ‌ని కూడా పేర్కొంది. అయితే తమ మ‌ధ్య హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా రాకతో గొడవలు మొదలయ్యాయని లావణ్య చెప్పుకొచ్చింది. మాల్వీకి, రాజ్‌ తరుణ్‌కి ఇల్లీగల్‌ రిలేషన్‌ ఉందని.. ఆమె కోసం రాజ్‌.. తనను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ మేరకు నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అలానే మాల్వీ, ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది.

Raj Tarun బండారం బయటపడింది..

లావ‌ణ్య త‌న ఫిర్యాదులో రాజ్ త‌రుణ్ త‌న‌ని గర్భవతిని కూడా చేశాడని.. రెండు నెలల సమయంలో సర్జరీ చేసి తీయించాడని కూడా తెలిపింది. ఈ మేరకు దానికి సంబంధించిన రిపోర్టులను కూడా పోలీస్ స్టేషన్‌లో అందించింది. లావణ్య సాక్ష్యాలు పోలీస్ స్టేషన్‌లో అందజేయడంతో పోలీసులు రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ తరుణ్‌కి నోటీసులు పంపించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాల మెసేజ్ చాట్ లీక్ అయ్యింది. 2023లో మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ప్రపోజల్‌ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ అంటూ మాల్వీ మల్హోత్రా రిప్లై ఇచ్చింది. ఇక మాల్వి అనేక సార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేసింది. ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో రాజ్ తరుణ్, మాల్వి కలిసేవారు.

Raj Tarun : రాజ్ త‌రుణ్ బండారం బ‌య‌ట‌ప‌డింది.. మాల్వీతో చాట్ లీక్..!

Raj Tarun : రాజ్ త‌రుణ్ బండారం బ‌య‌ట‌ప‌డింది.. మాల్వీతో చాట్ లీక్..!

వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారు. రోజువారీ ప్లానింగ్స్, ట్రిప్స్, ఔట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారని చాట్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్‌ తరుణ్‌ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ కావడం సంచలనంగా మారింది. ఇటీవ‌ల లావ‌ణ్య ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ త‌న లాయ‌ర్ కి మెసేజ్ కూడా పంప‌డం మ‌నం చూశాం. త‌న‌కి రాజ్ త‌రుణ్ కావాల‌ని ఆయ‌న‌తో జీవితం పంచుకోవాల‌ని తాను భావిస్తున్న‌ట్టు లావ‌ణ్య తెలియ‌జేసింది. ఈ చాట్ లీక్ త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp