Lavanya : నా తిండికి డ‌బ్బులు కావాల‌న్నా మాల్వి మ‌ల్హోత్రా చెప్పాల్సిందే.. లావ‌ణ్య ఆవేద‌న‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lavanya : నా తిండికి డ‌బ్బులు కావాల‌న్నా మాల్వి మ‌ల్హోత్రా చెప్పాల్సిందే.. లావ‌ణ్య ఆవేద‌న‌..!

Lavanya :  గ‌త కొద్ది రోజులుగా లావ‌ణ్య‌, రాజ్ త‌రుణ్‌ల విష‌యం సోష‌ల్ మీడియాలో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. రాజ్ తరుణ్ – లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. తాను గర్భం దాల్చితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Lavanya : నా తిండికి డ‌బ్బులు కావాల‌న్నా మాల్వి మ‌ల్హోత్రా చెప్పాల్సిందే.. లావ‌ణ్య ఆవేద‌న‌..!

Lavanya :  గ‌త కొద్ది రోజులుగా లావ‌ణ్య‌, రాజ్ త‌రుణ్‌ల విష‌యం సోష‌ల్ మీడియాలో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. రాజ్ తరుణ్ – లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎంటరయ్యాకే రాజ్‌తో తనకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Lavanya ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..

మొదట రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చిన లావణ్య.. అతనికి, తనకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అలాగే రాజ్ తరుణ్ తనను పెళ్లాడినట్లుగా, ఓసారి అబార్షన్ చేయించినట్లుగా కూడా చెప్పి.. అతనిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. ప్రేమ, పెళ్లి, అబార్షన్ వంటి అంశాలతో సాగిపోతున్న ఈ కథలో లావణ్య చెబుతున్న ప్రకారం విలన్ మాత్రం ‘తిరగబడరసామి’ హీరోయిన్ మాల్వి మల్హోత్రానే. రాజ్ త‌రుణ్ త‌న‌కి కావాల‌ని, రాజ్ త‌రుణ్‌పైన తాను కేసు పెట్ట‌లేద‌ని లావ‌ణ్య అంటుంది.

Lavanya నా తిండికి డ‌బ్బులు కావాల‌న్నా మాల్వి మ‌ల్హోత్రా చెప్పాల్సిందే లావ‌ణ్య ఆవేద‌న‌

Lavanya : నా తిండికి డ‌బ్బులు కావాల‌న్నా మాల్వి మ‌ల్హోత్రా చెప్పాల్సిందే.. లావ‌ణ్య ఆవేద‌న‌..!

రాజ్ త‌రుణ్‌తో ఇప్పుడు లావ‌ణ్య ఉంటుంది. మాల్వి చెబితేనే నా తిండి తిప్ప‌ల‌కి ఆయ‌న డ‌బ్బులు పంపించేవాడు. ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్, కామెంట్స్ చూస్తే తట్టుకోలేకపోతున్నాను.రాజ్ తరుణ్ నా ప్రపంచం.. వస్తాడో, రాడో కానీ వస్తాడనే ట్రై చేస్తున్నాను అంటూ లావ‌ణ్య చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్‌తో రిలేషన్‌ పెట్టుకుని తన కాపురంలో నిప్పులు పోస్తుందనేది లావణ్య ప్రధాన ఆరోపణ అనేది తెలిసిన విషయమే. ఆరోపణే కాదు.. ఆధారాలు కూడా లావణ్య చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. మాల్వి మల్హోత్రా మాత్రం నాకేం తెలియదు.. జస్ట్ అతని సినిమాలో హీరోయిన్‌ని మాత్రమే అంటూ.. ఆమె కూడా లావణ్యపై కంప్లయింట్ చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది