Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!
Raj Tarun – Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. సినీ స్క్రిప్ట్‌లను తలపించేలా ఈ వ్యవహారంలో రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా లావణ్య, తన ప్రాణాలను హరించేందుకు యత్నించారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా కూడా ఇందులో భాగమని ఆమె ఆరోపించారు.

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!
Raj Tarun – Lavanya సినిమా తరహాలో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్ లు
తనపై మానసిక, శారీరక వేధింపులు కొనసాగుతున్నాయని, ఇటీవల కొందరు మహిళలు తన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారని లావణ్య మీడియా ముందుకొచ్చి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. “నాకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరో తెలుసుకోకముందే స్పందించాలి. ప్రాణభయంతో ప్రతి నిమిషం జీవిస్తున్నా” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే కేసు మరింత ఆసక్తికర మలుపు తిప్పేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాజ్ తరుణ్, లావణ్య కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తోంది. ఇది గతం లోపల తీసినదా? లేక ఇటీవల జరిగిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
సంచలన వీడియో రిలీజ్ చేసిన లావణ్య
రాజ్ తరుణ్- లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్
ఈ క్రమంలోనే ఓ సంచలన వీడియో రిలీజ్ చేసిన లావణ్య
వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న రాజ్ తరుణ్, లావణ్య https://t.co/CIOeUWsLK9 pic.twitter.com/T8AGN0LwDu
— BIG TV Breaking News (@bigtvtelugu) April 20, 2025