Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి 11 ఏళ్ల కల ఇప్పటికి నిజమైంది

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 3 November 2023, 6:00 pm
  •  అందాల రాక్షసి సినిమాలో డైలాగ్ ఇప్పుడు నిజమైంది

  •  లక్కు తోక తొక్కిన లావణ్య త్రిపాఠి

  •  మెగా కుటుంబంలోకి కోడలుగా

Lavanya Tripathi : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్‌లావ్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నిన్న కాక మొన్న నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. అది కూడా మామూలు వెడ్డింగ్ కాదు. డెస్టినేషన్ వెడ్డింగ్. ఇటలీలో ఈ పెళ్లి వేడుక జరిగింది. టుస్కానీలో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వీళ్ల పెళ్లికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కొన్నేళ్ల నుంచి వీళ్లిద్దరూ లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి మరీ ఈ పెళ్లి చేసుకున్నారు. అయితే.. లావణ్య త్రిపాఠికి ఉన్న 11 ఏళ్ల కల తాజాగా నెరవేరిందని సోషల్ మీడియాలో ఓ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఎలాగూ వాళ్ల పెళ్లి ఫోటోలు, వాళ్ల పెళ్లికి వచ్చిన మెగా ఫ్యామిలీ ఫోటోలు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలను అయితే తెగ వైరల్ చేస్తున్నారు. కానీ.. ఈ 11 ఏళ్ల కల ఏంటి అంటున్నారా? పదండి.. వివరంగా తెలుసుకుందాం.

అసలు లావణ్య త్రిపాఠి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందే అందాల రాక్షసి అనే సినిమా ద్వారా. ఆ సినిమా తనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగింది లావణ్య. అయితే.. తన తొలి మూవీ అందాల రాక్షసి సినిమాలో తన పెళ్లి సీన్ ఉంటుంది. అప్పుడు కొందరు పిల్లలు.. లావణ్య అక్కా.. నీ పెళ్లికి సినిమా యాక్టర్స్ వస్తున్నారట కదా. అంటే పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా అంటూ లావణ్యను అడుగుతారు పిల్లలు. దీంతో అవును వస్తాడు అన్నట్టుగా తల ఊపుతుంది లావణ్య. ఆ మూవీ వచ్చి 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు 2023 లో అదే రిపీట్ అయింది కదా అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Lavanya Tripathi : లావణ్య పెళ్లికి నిజంగానే వచ్చిన మెగాస్టార్

ఆ సినిమా మెగాస్టార్ చూశారో లేదో తెలియదు కానీ.. లావణ్య పెళ్లికి మాత్రం నిజంగానే మెగాస్టార్ చిరంజీవి వచ్చారవు. అందుకే ఆ సినిమాలోని ఆ సీన్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి తన 11 ఏళ్ల కలను లావణ్య త్రిపాఠి నిజం చేసుకుంది. గ్రేట్ లావణ్య. మెగా కుటుంబంలోకి కోడలుగా వెళ్లావంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అంటూ తనను తెగ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి