Lavanya Tripathi : రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lavanya Tripathi : రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ నవంబర్ లో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చారు. పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ పైవాళ్లు దృష్టి సారిస్తున్నారు. ఒక పక్క వరుణ్ తేజ్ ‘ ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Lavanya Tripathi : రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ నవంబర్ లో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చారు. పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ పైవాళ్లు దృష్టి సారిస్తున్నారు. ఒక పక్క వరుణ్ తేజ్ ‘ ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో పక్క లావణ్య త్రిపాఠి తాను ప్రధాన పాత్ర పోషించిన ‘ మిస్ ఫర్ ఫెక్ట్ ‘ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి, హీరో అభిజిత్, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి తర్వాత ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈవెంట్లో పాల్గొన్న లావణ్య పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. మంచి కథ వస్తే సినిమాలు వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా ఏదైనా చేస్తానని అన్నారు. ప్రస్తుతం మిస్ ఫర్ఫెక్ట్ తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నానని అన్నారు. ఇక మెగా కోడలు అనే ట్యాగ్ తో నాపై బాధ్యతలు పెరిగాయని, పెళ్లి తర్వాత చేసే సినిమాల విషయంలో వరుణ్ కానీ మా కుటుంబం కానీ నాకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని లావణ్య చెప్పుకొచ్చారు. వరుణ్ కూడా ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని, నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని, అవి నాకు తెలుసని, వాటిని దాటకుండా సినిమాలు చేస్తానని లావణ్య చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం లావణ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ ప్రధానపాత్రలు పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. సీరీస్ ఫిబ్రవరి 2వ తేదీన స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ ను స్కైలాబ్ ఫేమ్మ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై సుప్రియ యార్లగడ్డ సిరీస్ ను నిర్మించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, అభిజిత్ తో పాటు అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోహన్ కీలక పాత్రలు పోషించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది