Categories: EntertainmentNews

Lavanya Tripathi : రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..!

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరో వరుణ్ తేజ్ నవంబర్ లో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చారు. పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ పైవాళ్లు దృష్టి సారిస్తున్నారు. ఒక పక్క వరుణ్ తేజ్ ‘ ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరో పక్క లావణ్య త్రిపాఠి తాను ప్రధాన పాత్ర పోషించిన ‘ మిస్ ఫర్ ఫెక్ట్ ‘ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి, హీరో అభిజిత్, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి తర్వాత ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈవెంట్లో పాల్గొన్న లావణ్య పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. మంచి కథ వస్తే సినిమాలు వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా ఏదైనా చేస్తానని అన్నారు. ప్రస్తుతం మిస్ ఫర్ఫెక్ట్ తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నానని అన్నారు. ఇక మెగా కోడలు అనే ట్యాగ్ తో నాపై బాధ్యతలు పెరిగాయని, పెళ్లి తర్వాత చేసే సినిమాల విషయంలో వరుణ్ కానీ మా కుటుంబం కానీ నాకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని లావణ్య చెప్పుకొచ్చారు. వరుణ్ కూడా ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని, నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని, అవి నాకు తెలుసని, వాటిని దాటకుండా సినిమాలు చేస్తానని లావణ్య చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం లావణ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ ప్రధానపాత్రలు పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. సీరీస్ ఫిబ్రవరి 2వ తేదీన స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ ను స్కైలాబ్ ఫేమ్మ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై సుప్రియ యార్లగడ్డ సిరీస్ ను నిర్మించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, అభిజిత్ తో పాటు అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోహన్ కీలక పాత్రలు పోషించారు.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

42 minutes ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

2 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

4 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

6 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

8 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

10 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

11 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

12 hours ago