Lavanya tripathi : అక్క చేసిన తప్పే చేస్తున్న లావణ్య త్రిపాఠి .. పిల్లల విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న మెగా కోడలు..!
ప్రధానాంశాలు:
Lavanya tripathi : అక్క చేసిన తప్పే చేస్తున్న లావణ్య త్రిపాఠి .
పిల్లల విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్న మెగా కోడలు..!
Lavanya tripathi : సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ‘ అందాల రాక్షసి ‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇక ఆమె హీరోయిన్గా కంటే ఎక్కువగా ఇప్పుడు మెగా కోడలుగా ఫుల్ పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి పెళ్లి ఇటలీలో ఎంతో గ్రాండ్గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలుమ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కలాగే చెల్లి కూడా పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని జనాలు అనుకుంటున్నారు.
మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన ఏకంగా పదేళ్లు గ్యాప్ తీసుకొని పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే పనిని లావణ్య త్రిపాఠి కూడా చేయబోతుందని ఓ వార్త వైరల్ అవుతుంది. మీడియా కథనాల ప్రకారం లావణ్య త్రిపాఠి కొన్నేళ్లపాటు పిల్లలను వద్దనుకుంటున్నారట. అంతేకాదు ఆమె మళ్లీ సినిమాలలో నటించాలని అనుకుంటున్నారట. అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. అలాగే ఒక బ్రాండెడ్ డిజైనర్ షోరూమ్ కూడా ఓపెన్ చేయాలని, సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన దుస్తులను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా ఓ వెబ్సైట్ ను రన్ చేయాలని అనుకుంటున్నారట.
ఇలా తన లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉన్నాయని, పిల్లలను కంటే ఈ డ్రీమ్స్ అన్నీ చేయలేను అని, ఇవన్నీ పూర్తయ్యాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలని లావణ్య త్రిపాఠి అనుకుంటున్నారట. దీంతో మెగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మెగా ఆడబిడ్డలు అలా, మెగా కోడళ్లు ఇలా అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఉపాసన పిల్లల కోసం పదేళ్లు టైం తీసుకుంది, నువ్వు ఇంకో 20 ఏళ్లు టైం తీసుకో అని దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి న్యూస్ వైరల్ అవుతుంది.