#image_title
Lavanya Tripathi : ‘ అందాల రాక్షసి ‘ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత వరుస సినిమాలు చేసి మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇక రీసెంట్ గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్నారు. హీరోయిన్ గా కంటే లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా ఫుల్ పాపులర్ అవుతున్నారు. పెళ్లి తర్వాత నుంచి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే పెళ్లికి ముందు లావణ్య త్రిపాఠి ‘ పులి మేక ‘ అనే వెబ్ సిరీస్ లో నటించారు.
ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి కీలక పాత్ర పోషించారు. అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులు ప్రశంసలు పొందిన ఈ సిరీస్ లో సిటీలో పోలీసులను వరుసగా హత్యలు చేసే కిల్లర్ ఎవరో కాదు ఐపీఎస్ ఆఫీసర్ అయినా కిరణ్ ప్రభ గా లావణ్య త్రిపాఠి నటించారు. ఈ విషయం తెలిసిన ఆడియన్స్ ఆశ్చర్యానికి గురవుతారు. హిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందిష ఇక లావణ్య త్రిపాఠి కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఓ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి రెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ ఇచ్చారు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లికి ముందు అలాంటి డ్రెస్ లో కనిపించిన లావణ్య పెళ్లి తర్వాత కూడా ఇలానే ఉంటారా అని కొందరు అడుగుతున్నారు. లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ తగ్గట్టుగా గౌరవంగా ఉంటారా లేదా అని చర్చించుకుంటున్నారు. అయితే లావణ్య త్రిపాఠి ఇప్పటిదాకా నటించిన సినిమాలలో ఎక్కడా కూడా ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వలేదు. ఆమె సాంప్రదాయానికి ట్రెండీ ఫ్యాషన్ కి మధ్యలో ఉన్నారు. ఆమె ఎక్కడా కూడా మితిమీరి డ్రెస్సులు వేయలేదు అని, అందుకే లావణ్య మెగా కోడలు అయిందని కొందరు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.