Liger Movie : లైగ‌ర్ సినిమాని ఫ్లాప్ చేసేందుకు ఆ హీరోల ఫ్యాన్స్ అంత కుట్ర పన్నారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Liger Movie : లైగ‌ర్ సినిమాని ఫ్లాప్ చేసేందుకు ఆ హీరోల ఫ్యాన్స్ అంత కుట్ర పన్నారా..!

Liger Moive : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన లైగ‌ర్ చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘లైగర్‌’కి కూడా రివ్యూ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 August 2022,12:00 pm

Liger Moive : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన లైగ‌ర్ చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘లైగర్‌’కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. విజయ్‌ దేవరకొండ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడని, యాక్షన్‌ స్టంట్స్‌ అదరగొట్టేశాడని రివ్యూలో చెప్పుకొచ్చాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్. డైరెక్షన్ అదిరిపోయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్ గా ఉన్నాయి’ అని ఉమైర్ సంధు తన రివ్యూను ఇచ్చారు.

Liger Moive : ఎందుకిలా?

అయితే కొద్ది రోజులుగా కొన్ని సినిమాల‌కు నెగెటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ ట్రెండ్ తో ఫుల్ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు లైగ‌ర్ సినిమాకు కూడా తాకింది. అటు నార్త్‌లో లైగ‌ర్‌ను టార్గెట్ చేస్తూ బాయ్‌కాట్ ట్రెండ్ న‌డుస్తుంటే.. టాలీవుడ్‌లో కొంద‌రు హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ నెగ‌టివిటి స్ప్రెడ్ చేసేందుకు కాచుకుని ఉన్నార‌ని.. వారి సోష‌ల్ మీడియా పోస్టులే చెపుతున్నాయి. చివ‌ర‌కు ఈ నెగ‌టివిటిని త‌ట్టుకునేందుకు సినిమా మేక‌ర్స్ విజ‌య్ పీఆర్ టీంతో పాటు మ‌రో టీంను ఏర్పాటు చేసుకుని పాజిటివిటిని స్ప్రెడ్ చేస్తోంది. ఏదేమైనా ఈ త‌ర‌హా విధానాన్ని ఎవ‌రైనా ఖండించాల్సిందే.

Liger Moive Getting Negative Talks By Fans Of Other Hero

Liger Moive Getting Negative Talks By Fans Of Other Hero

బింబిసార‌కు హిట్ టాక్ రావ‌డంతో అంద‌రు హీరోల అభిమానులు భుజాన‌కెత్తుకుని మోశారు. అయితే ఇప్పుడు రేపు రిలీజ్ అవుతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్‌ను టార్గెట్ చేస్తూ నెగ‌టివిటి స్ప్రెడ్ చేసేందుకు కొంద‌రు హీరోల అభిమానులు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. విజ‌య్‌కి త‌క్కువ టైంలో ఈ రేంజ్ క్రేజ్ రావ‌డంతో కొందరు కావాల‌ని ఇలా నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. మ‌రి రేపు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇది కొన‌సాగుతుందా లేదా అనేది చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది