Puri Jagannath Audio Leak : బ్లాక్ మెయిల్ చేస్తున్నారా.. డిస్ట్రిబ్యూటర్ వార్నింగ్ ఇస్తున్న పూరీ జగన్నాథ్ ఆడియో లీక్‌..!

Authored By Rame Samhith | The Telugu News | Updated on: October 25, 2022, 1:08 pm

Puri Jagannath Audio Leak : లైగర్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీ ఆఫీస్ ముందు ధర్నాకి దిగాలని ఫిక్స్ అయ్యారు. లైగర్ సినిమాని భారీ మొత్తానికి అమ్మేసిన పూరీ ఆ సినిమా వల్ల నష్టపోయిన వారికి తిరిగి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పూరీకి తెలియగా ఆయన ఫోన్ లో మాట్లాడుతున్న ఆడియో లీక్ అయ్యింది. తన ఆఫీస్ మీదకు ధర్నాకి వస్తే అలా చేసిన వారికి అసలు డబ్బులు ఇవ్వనని అన్నారు పూరీ.

అసలు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ తన పరువు పోకూడదు అనే ఉద్దేశంతోనే డబ్బులు ఇస్తానని చెప్పాను. కానీ వారు ధర్నాకి దిగితే అలా చేసిన వారికి బదులుగా మిగతా వారికి డబ్బులు ఇస్తానని అంటున్నారు పూరీ. తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఏంటి అని.. తనతో మంచిగా ఉంటే మంచి కాదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. పోకిరి నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు తన సినిమా వల్ల లాభాలు వచ్చిన వారి నుంచి తనకు రావాల్సిన మొత్తన్ని డిస్ట్రిబ్యూటర్ సంఘం తిరిగి ఇప్పిస్తుందా అని అన్నారు.

Puri Jagannadh Audio Leak

Puri Jagannadh Audio Leak

ప్రస్తుతం పూరీ లీక్డ్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన లైగర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కింది. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించారు. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినా ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఫైనల్ గా లైగర్ పై నడుస్తున్న ఈ గొడవ ఎప్పటికి సర్ధుమనుగుతుందో చూడాలి. నిన్న మొన్నటిదాకా ఇన్నర్ గా జరుగుతున్న లైగర్ గొడవ పూరీ ఆడియో లీక్ తో బయటకు వచ్చింది. మరి ఈ గొడవ మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp