Vijay Devarakonda : ‘లైగర్’ నష్టాలు.. విజయ్ దేవరకొండ ఆ పని చేస్తాడా? లేదా?
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాదాపుగా 90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను చేసిన ఈ సినిమా కనీసం 30 కోట్ల వసూలను కూడా దక్కించుకోలేక పోయింది. వరంగల్ శీను ఈ సినిమాతో పెద్ద ఎత్తున నష్టపోయాడు అంటూ సమాచారం అందుతుంది. ఆయనకు కొద్ది మొత్తంలో అయినా దర్శకుడు కం నిర్మాత పూరి జగన్నాథ్ రిటర్న్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు విజయ్ దేవరకొండ కూడా నష్టాల్లో తన వంతు భాగస్వామ్యం అన్నట్లుగా కొంత మొత్తాన్ని తన పారితోషికం నుండి వెనక్కు ఇచ్చే విషయమై చర్చలు జరుపుతున్నాడట. దాదాపుగా 30 కోట్ల పారితోషకాన్ని విజయ్ దేవరకొండ తీసుకున్నాడట. అందులోంచి 10 కోట్ల పారితోష్ణాన్ని వెనక్కి ఇచ్చే విషయమై దర్శకుడు మరియు ఇతర నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడూ కూడా రిటర్న్ ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ మొదటిసారి ఈ సినిమాకి భారీ ఎత్తున నష్టం వచ్చింది కనుక రిటర్న్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ మంచి మనసుతో భారీ మొత్తంలో వెనక్కి ఇస్తున్నాడంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక విజయ్ దేవరకొండ ఇతర సినిమాల గురించి మాట్లాడుకుంటే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా తెరకెట్టుతున్న విషయం తెలిసింది. ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను విజయ్ దేవరకొండ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది చివర్లో ఆ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉందని ఇటీవలే దర్శకుడు సుకుమార్ తెలియ జేసిన విషయం తెలిసిందే. మొత్తానికి విజయ్ దేవరకొండ బిజీబిజీగా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.