Categories: EntertainmentNews

Hyper Aadi : ఈటీవీలో హైపర్ ఆది.. స్టార్ మా లో అవినాష్ భలే సెట్ అయ్యారు

Hyper Aadi : ఈ మధ్య కాలంలో ఈటీవీలో ప్రతీ కార్యక్రమంలో కూడా హైపర్ ఆది కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది లేడు అనే ఆవేదన, అసహనం ప్రేక్షకుల్లో కనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే జబర్దస్త్ లో హైపర్ ఆది రీ ఎంట్రీ ఇచేశాడు. ఆయన రీ ఎంట్రీ తో జబర్దస్త్ కి మళ్ళీ మునుపటి ఉత్సాహం, మునుపటి ఆదరణ కలగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే నమోదైన రేటింగ్ ని బట్టి చూస్తుంటే హైపర్ ఆది ఎంట్రీ తో మంచి ఫలితం నమోదవుతుంది అని క్లారిటీ వచ్చేసింది. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హైపర్ ఆది సత్తా చాటుతున్నాడు. ఈ రెండు షోల్లో కాకుండా పండగ స్పెషల్ డాన్స్ కార్యక్రమాలు ఇలా ప్రతి చోటా కూడా హైపర్ ఆది ఉంటున్నాడు. ఈటీవీలో హైపర్ ఆది ఎలా అయితే మారాడో ఇప్పుడు స్టార్ మా లో కూడా అవినాష్ అలాగే ఉన్నాడు.

జబర్దస్త్ నుండి వెళ్లిన ముక్కు అవినాష్ మాటీవీలో బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని మరింతగా పెంచుకున్నాడు. ఇప్పుడు అతడి యొక్క క్రేజ్ అమాంతం పెరిగింది. శ్రీముఖితో ఉన్న సన్నిహిత్యంతో మొదట్లో ఆఫర్లు దక్కించుకున్న అవినాష్ ఇప్పుడు సొంత ప్రతిభతో స్టార్ మా లో స్టార్ గా నిలిచాడు. స్టార్ మా వారు ఏ కార్యక్రమం చేసినా కూడా అవినాష్ ముందు ఉంటున్నాడు. అవినాష్ లేకుండా కామెడీ కార్యక్రమం కానీ.. ఏదైనా ప్రత్యేక కార్యక్రమాన్ని కానీ స్టార్ మా వారు చేయడం లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ మా లో బిగ్గెస్ట్ కామెడీ స్టార్ గా అవినాష్ అవతరించాడు. ఆయన యొక్క క్రేజ్ మరియు ఆయన యొక్క కామెడీ టైమింగ్ స్టార్ మా వారు బాగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల సుడిగాలి సుదీర్ స్టార్ మా కి వెళ్ళాడు. అయినా కూడా సుదీర్ కంటే ఎక్కువగా అవినాష్ కనిపిస్తూ నవ్విస్తున్నాడు. మొత్తానికి అవినాష్ మరియు స్టార్ మా బంధం రోజురోజుకు పెరుగుతుంది.

like in etv mallemala hyper aadi in star maa tv mukku Avinash doing

ఈటీవీ తో హైపర్ ఆది యొక్క బంధం పెరిగినట్లుగానే సుడిగాలి సుదీర్ కంటే కూడా అవినాష్ స్టార్ మా బంధం పెరుగుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ మా వారు అవినాష్ కి భారీ పారితోషికం ఇస్తున్నారట. ఒకరకంగా చెప్పాలంటే ఈటీవీ, మల్లెమాల వారు హైపర్ ఆదికి ఇచ్చే స్థాయిలో అవినాష్ కి పారితోషకం దక్కుతుంది అనేది బుల్లి తెర వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. ప్రస్తుతం అవినాష్ స్టార్ మా పరివార్ సండే కార్యక్రమంలో కీలక కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు తన కామెడీతో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తాడని స్టార్ మా నిర్వాహకులు మరియు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా ఆయన యొక్క కామెడీ అందరికీ నచ్చుతుందని, భారీ పారితోషికం ఇచ్చి మరీ ఆయనతో ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నారు. ముందు ముందు అవినాష్ స్టార్డం మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైపర్ ఆది రేంజ్ లో కాకుండా అవినాష్ మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

39 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

2 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

7 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

8 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

9 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

11 hours ago