Ravi Teja : లిప్ కిస్ సెంటిమెంట్ ర‌వి తేజ‌కి వ‌ర్క‌వుట్ కాక‌పోయిన తెగ లాంగిచేస్తున్నాడుగా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 23, 2022, 12:00 pm

Ravi Teja : సినిమా ఇండ‌స్ట్రీలో ఒక్కొక్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఒక‌సారి క‌లిసి వ‌చ్చిదానిని సెంటిమెంట్‌గా ఫాలో అవుతూ త‌న ప్ర‌తి సినిమాలో అదే ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి అది వ‌ర్కవుట్ కాక‌పోయిన కూడా ప్ర‌తి సినిమాలో ఫాలో అవుతూనే ఉంటారు. మాస్ మ‌హ‌రాజాకి ర‌వితేజ‌కి లిప్ లాక్ సెంటిమెంట్ ఒక‌టి ఉంద‌ట‌. ఈ సెంటిమెంట్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోయిన అదే ప‌నిగా కానిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మంది హీరోయిన్స్‌తో ర‌వితేజ లిప్ లాక్ చేశాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మాస్ మహారాజ్ రవితేజ కష్టపడి పైకి వచ్చారు. లైఫ్ ను జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేస్తూ.. ఆతరువాత హీరోగా చాలా లేట్ గా కెరీర్ బ్రేక్ ను అందుకున్నారు. ఇక ఆతరువాత తిరిగి చూసుకోలేదు మాస్ మహారాజ్. వరుస హిట్లతో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ను అది కూడా మాస్ ఇమేజ్ ను సాధించారు రవితేజ ఇక స్టార్ ఇమేజ్ తో పాటు ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ను..

కొన్ని విమర్షలను కూడా ఫేస్ చేస్తున్నాడు రవితేజ. ఈ మధ్య రవితేజ్ పై రకరకరాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రవితేజ నిర్మాతలను ఇబ్బంది పెడతారని, అందులోను రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ చాలా కచ్చితంగా ఉంటాడని, నిర్మాతలను వేధిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. రవితేజ్ రీసెంట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ విషయంలో కూడా ఇదే జరిగిందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ క్ర‌మంలో రవితేజ స్పందిస్తూ.. రామారావు ఆన్ డ్యూటీకి’ తాను కోప్రొడ్యూసర్ ని అని… అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని రవితేజ ఘాటుగా రివర్స్ క్వశ్చన్ వేశారు. అంతే కాదు. నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు… వారిచ్చిన చెక్ లను తాను చించేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మోదంటూ వేడుకున్నారు. ఇక హీరో అనే ఇమేజ్ చట్రంతో సినిమా ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని చోట్ల హీరోలు చెప్పినట్లు దర్శకులు చేయకతప్పదు. అయినా లిప్ కిస్సుల విషయంలో హీరోలు కూడా పెద్ద రిస్ర్టిక్షన్స్ పెట్టరు.

Lip Kiss Sentiment Ravi Teja Unworked

Lip Kiss Sentiment Ravi Teja Unworked

దర్శకుల హీరోగానే అనిపించుకోవడానికి చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తారు. చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికే ఆ రకమైన సన్నివేశాలకు దూరంగా జరిగారు. కానీ నాగార్జున…రవితేజ్ లాంటి వారు మాత్రం ఆ వేగాన్ని ఇంకా తగ్గించలేదు. సీన్ డిమాండ్ చేస్తే మేము రెడీ అంటూ రంగంలోకి దిగిపోతున్నారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ మధ్య `మన్మధుడు-2`లోనూ కింగ్ లిప్ లాక్ లో నటించి విమర్శలు ఎదుర్కున్నారు. 60 ఏళ్ల వయసులో ఆ సీన్లు ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాగార్జున ఆ దూకుడు కాస్త తగ్గించారు. కానీ రవితేజ మాత్రం ఎవరేమనుకున్నా లిప్ లాక్ విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. రాజాలో ఈ ఒరవడి ఇటీవలి కాలంలోనే మొదలైంది. `కికి-2` లో రకుల్ ప్రీత్ సింగ్ తో..`టచ్ చేసి చూడు`లో రాశీఖన్నాతో..`

దేవుడు చేసిన మనుషులు` లో ఇలియానాతో రవితేజ లిప్ లాక్ లు వేసాడు. ఇటీవలే రిలీజ్ అయిన `ఖిలాడీ` సినిమాలో సైతం ఇద్దరి భామలతో వేసిన లిప్ లాక్ లు గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలేవి విజయం సాధించకపోగా.. లిప్ కిస్సులు కలిసి రాలేదు అన్న అపవాదను మూటగ్గటుకున్నాడు.మ‌రోవైపు ఈ ముద్దుల గోల ఏందంటూ ప‌లువురి చేత విమ‌ర్శ‌లు పాల‌య్యాడు. ప్రస్తుతం రవితేజ కథానాయుడిగా నటిస్తోన్న `రామారావు ఆన్ డ్యూటీ`లో కూడా హీరోయిన్ తో పెదవి ముద్దుల సన్నివేశాలున్నాయని సమాచారం. మరి ఈసారైనా లిప్ కిస్సు రాజాకి వర్కౌట్ అవుతుందా? పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి. ఇది కూడా తేడా కొట్టిందంటే ర‌వితేజ విమ‌ర్శ‌ల పాలు కావ‌డం ప‌క్కా. దాంతో అయిన మ‌నోడు ఆ సెంటిమెంట్‌కి దూరంగా ఉంటాడ‌ని కొంద‌రు చెబుతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp