Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన చేయబోతున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉండబోతున్నాయి. అంతేకాదు, దర్శకులు కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ డమ్ ఉన్నవాళ్ళే లైన్‌లోకి వస్తున్నారు. ఇప్పటికే, శంకర్ దర్శకత్వంలో చరణ్ తన 15వ సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయబోతున్నాడు. అలాగే, మరికొంత మంది లైన్‌లో ఉండగా చరణ్ తమిళ క్రేజీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చినట్టు తాజాగా సమాచారం.లోకేష్ కనగరాజ్…ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ దర్శకుడి పేరే మార్మోగిపోతుంది.
ఇప్పటి వరకూ ఆయన కొలీవుడ్ లో చేసిన సినిమాలు నాలుగు. వాటిలో మొదటి సినిమా ‘మానగరం’ ఒకే అనిపిస్తే కార్తీ ఖైదీ, విజయ్ మాస్టర్ సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ వారం రిలీజైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అలరించడమే కాదు, భారీ మల్టీస్టారర్ ను లోకేష్ కమగ్ రాజ్ ఢీల్ చేసిన విధానం ఫిలిం మేకర్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. దాంతో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టిన లోకేష్ ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ఉంటుందని కూడా వెంటనే క్లారిటీ ఇచ్చాడు. విక్రమ్ సినిమా క్లయిమాక్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ తోనే సీక్వెల్ పార్ట్ సాగనుంది.
రీసెంట్ గా కమల్ కూడా విక్రమ్2 ఉంటుందని, అందులో రోలెక్స్ క్యారెక్టర్ చేసిన సూర్య ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తాడని అనౌన్స్ చేశాడు. ఖైదీ తర్వాత మాస్టర్ ఛాన్స్ ఇచ్చిన ఇళయదళపతి విజయ్ తో తన కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకురాబోతున్నాడు లోకేష్. విజయ్ 67వ మూవీ తెరకెక్కనుంది.ఈ ప్రాజెక్ట్ లో విజయ్ గ్యాంగ్ స్టార్ గా కానిపిస్తాడు. అయితే, లోకేష్, విజయ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా విక్రమ్ మూవీకి లింక్ ఉంటుందిట. ఆ తర్వాత తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ప్రాజెక్ట్ ఉండబోతుంది. ఈ సినిమాని కూడా లోకేష్ విక్రమ్ సినిమాకి లింక్ ఉండేలానే ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి లోకేష్ కానగరాజ్ యూనివర్స్ లో ఇంకా ఎంత మందిని యాడ్ చేస్తాడో అని ఇప్పుడు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.