sai dharam tej new look viral
Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమాలతోనే కాకుండా తన ప్రవర్తనతోను అందరి మన్ననలు పొందాడు. తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో పెద్ద ప్రమాదం బారిన పడ్డాడు. దాదాపు నెల రోజులకి పైన ఆసుపత్రలో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మాములు మనిషిగా మారాడు. 2021లో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురి కాగా, కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. పూర్తిగా రికవరీ అయ్యే వరకు సాయి ధరమ్ మీడియా కంటికి కనిపించలేదు. కొద్ది నెలల తర్వాత మెగా హీరోలు అందరూ కలిసి సాయి ధరమ్ కి వెల్కమ్ చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ ఆయన చేత కేక్ కట్ చేయించి, లోకానికి పరిచయం చేశారు. తర్వాత కూడా సాయి ధరమ్ బయట కనిపించడం మానేశారు.
షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు విక్రమ్ మూవీ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి.. కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి ఆయన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సల్మాన్ కూడా రావడం జరిగింది. విక్రమ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నితిన్, మెగా హీరోలు వరుణ్ తేజ్ కూడా పాల్గొనడం జరిగింది. చిరు ఇంట్లో జరుగుతున్న ప్రముఖుల పార్టీ కావడంతో సాయి ధరమ్ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో సాయి ధరమ్ చాలా సన్నగా మారిపోయి కనిపించాడు. ఒకప్పటి గ్లామర్ ఆయనలో లేదు. క్యాప్ ధరించి డీగ్లామర్ గా ఆయన కనిపించారు. సాయి ధరమ్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. తేజ్ కావాలనే సన్నబడ్డారా? లేక పూర్తిగా కోలుకోలేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
sai dharam tej new look viral
సాయి ధరమ్ తేజ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమాల్లో డాన్స్ లు, పాటలు, ఫైట్స్ వీటికి ప్రయారిటి ఎక్కువ ఇస్తూంటారు.ఇప్పుడు కథల్లో వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆయన ఓ సినిమా చేస్తున్నారు. అందుకు సంభందించిన మేకింగ్ పోస్టర్ విడుదల చేశారు.చేతబడి ( బ్లాక్ మ్యాజిక్) నేపథ్యంలో కథ, కథనాలు సాగుతాయని సమాచారం. చేతబడికి బలవుతూ అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామానికి, ముంబై నుంచి వచ్చే ఇంజనీర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ సంఘటనలను హీరో ఎలా ఛేదిస్తాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనే ఇతివృత్తంతో ఈ కథ..నడుస్తుందని అని టాక్ వినిపిస్తోంది.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.