Janaki Kalaganaledu 14 June Today Episode : సెమీ ఫైనల్స్ లో రామాకు షాక్.. రామా వంటకం నచ్చినా ఎలిమినేట్.. సునంద ప్లాన్ సక్సెస్ కానీ..?

Janaki Kalaganaledu 14 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 322 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ అందరి టేబుల్స్ మీద నాన్ వెజ్ ఐటెమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఐటైమ్స్ తయారు చేయండి అంటాడు చెఫ్ సంజయ్. దీంతో సార్.. అది అంటూ రామచంద్ర ఏదో చెప్పబోతాడు. మేము మాంసం ముట్టుకోము సార్.. అందుకని ఏదైనా వేరే వంట ఇస్తే చేస్తా అని అంటాడు రామా. దీంతో కాంపిటిషన్ లో ఏది ఇస్తే అది చేయాలి. చెఫ్ అంటే అన్ని చేయాలి. అది కాంపిటిషన్ లో రూల్.. అని అంటాడు చెఫ్ సంజయ్. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. టీవీలో చూస్తూ మల్లికకు తెగ సంతోషం వేస్తుంది. ఇంతలో చెఫ్ దగ్గరికి జానకి వెళ్తుంది. సర్.. నా భర్త చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ కు దూరం. ఒక వ్యక్తి తాలుకు మనోభావాలను ఖచ్చితంగా గౌరవించాలి. అది పోటీ గైడ్ లైన్స్ లోనూ రాసి ఉంది. దయచేసి నా భర్తకు వేరే టాస్క్ ఇవ్వండి అని చెఫ్ ను కోరుతుంది జానకి. దీంతో మేడమ్ తో డిస్కస్ చేసి నిర్ణయం చెబుతాం అంటాడు చెఫ్. మీరు వెళ్లి కూర్చోండి అంటాడు సంజయ్.

janaki kalaganaledu 14 june 2022 today episode

తర్వాత ప్రభ, సంజయ్ ఇద్దరూ డిస్కస్ చేసుకొని.. మిస్టర్ రామచంద్రా ఏ టాస్క్ ఇచ్చినా మీరు చేస్తారా.. టాస్క్ ఇచ్చిన తర్వాత మీరు తప్పకుండా మా నిర్ణయాన్ని గౌరవించాలి. అలా కాకుండా మీరు అభ్యంతరం తెలిపితే మిమ్మల్ని పోటీ నుంచి బయటికి పంపించేస్తాం.. అంటాడు చెఫ్ సంజయ్. దీంతో సరే అంటాడు రామా. టాస్క్ ఏంటంటే.. కళ్లకు గంతలు కట్టుకొని మీకు నచ్చిన వంట చేయాలి. అది కూడా ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా చేయాలి అంటాడు. దీంతో రామా షాక్ అవుతాడు. కానీ.. తప్పకుండా చేస్తాను సార్ అంటాడు రామా. ఓకే.. అయితే కానివ్వండి అంటాడు చెఫ్ సంజయ్. మల్లికకు చాలా సంతోషం వేస్తుంది. మల్లిక ఎకసెక్కాలు చేస్తుండటంతో తన అన్న గెలవాలని గుడికి తీసుకెళ్లి తనతో మోకాళ్ల మీద గుడిలో నడిపిస్తాడు.

మరోవైపు రామా కళ్లకు గంతలు కడతారు. వంట ప్రారంభించు అంటారు. కళ్లకు గంతలు కట్టుకొని వంట చేయడం చాలా కష్టం. పాపం.. రామా సమస్యల్లో పడుతున్నాడేమో అని గోవిందరాజుతో అంటుంది జ్ఞానాంబ. దీంతో కళ్లకు గంతలు కట్టినా నా కొడుకే గెలుస్తాడు అంటాడు గోవిందరాజు.

మరోవైపు రామా వంట చేయడం ప్రారంభిస్తాడు. ఈ పోటీల్లో ఆ రామా గాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి వీలు లేదు అని ఓ కంటెస్టెంట్ కు ముందే చెబుతుంది సునంద. వాడు చేసే వంటలో ఏదో ఒకటి కలిపి వాడు ఓడిపోయేలా చేయి అని తనకు డబ్బులు ఇస్తుంది సునంద. ఫైనల్ లో నాకు రామానే స్ట్రాంగ్ పోటీ. అతడిని ఇక్కడ ఓడిస్తే.. ఫైనల్ లో నా గెలుపుకు ఎదురే ఉండదు అంటుంది.

Janaki Kalaganaledu 14 June Today Episode : రామానే వెనిగర్ కలపాడని ఆరోపించిన లేడీ కంటెస్టెంట్

ఆ రామా గాడు ఓడిపోయేలా చేయాలంటే.. వాడు చేస్తున్న వంటలో కదా కలపాల్సింది. కానీ.. ఈ పిల్ల ఏంటి.. తను చేస్తున్న వంటలో నీళ్లు కలిపింది అని అనుకుంటుంది సునంద. ఏమైంది అని అడుగుతుంది.. ప్లాన్ అమలు చేశా అని సైగలు చేస్తుంది ఆ కంటెస్టెంట్.

మరోవైపు మల్లికతో గుడి చుట్టూ మోకాళ్ల మీద నడిపిస్తూ ఉంటాడు విష్ణు. దీంతో తనకు చుక్కలు కనిపిస్తాయి. మీ సమయం మించిపోతోంది.. అని యాంకర్ అంటుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి లాస్ట్ లో ఆపండి అంటుంది యాంకర్. అందరూ వంట చేయడం ఆపేస్తారు.

ఇప్పుడు మీ ఐదుగురు తయారు చేసిన వంటలను స్టేజ్ మీద ఉన్న ఐదుగురం టేస్ట్ చేసి.. మా అభిప్రాయలను బట్టి మార్కులు ఇస్తాం. ఎవరికైతే తక్కువ మార్కులు వస్తాయో.. వాళ్లలో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తాం. మిగిలిన ముగ్గురు ఫైనల్స్ లోకి వెళ్తారు అని చెబుతుంది ప్రభ.

దీంతో వాళ్లు వండిన వంటకాలను జడ్జిలకు అందరూ సర్వ్ చేస్తారు. రామా చేసిన వంటకాన్ని తిని ప్రభ మెచ్చుకుంటుంది. అద్భుతం.. అంటుంది. మరోవైపు రామా పక్క కంటెస్టెంట్ ను ఏంటమ్మా వెనిగర్ ఇంత కలిపావు అని అడుగుతాడు చెఫ్ సంజయ్. దీంతో నేను అసలు వెనిగర్ కలపలేదు అంటుంది.

మరి.. ఆ వెనిగర్ స్మెల్ ఎక్కడిది అని అడుగుతుంది. ఈ రామచంద్రా కలిపి ఉంటాడు అని అంటుంది. తన ప్రత్యర్థిని ఓడించడానికి రామచంద్రే ఇలా చేసి ఉంటాడని మాకు అనిపిస్తోంది. అందుకే.. ఈ కాంపిటిషన్ నుంచి రామచంద్రాను ఎలిమినేట్ చేస్తున్నాం అంటుంది ప్రభ.

దీంతో రామాతో పాటు జానకి, జ్ఞానాంబ, గోవిందరాజు షాక్ అవుతారు. సునంద మాత్రం చాలా సంతోషిస్తుంది. నా కొడుకు అలాంటి వాడు కాదు అని జ్ఞానాంబ.. జడ్జిలను వేడుకుంటుంది. అవసరం అయితే ఆనందంగా ఓటమిని ఒప్పుకుంటాడు కానీ.. ఇలా మోసం చేయడు అంటుంది జ్ఞానాంబ.

దీంతో కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తుంది కదా అంటాడు చెఫ్ సంజయ్. దీంతో కేవలం బాటిల్ ఖాళీగా ఉంది కదా అని పోటీ నుంచి ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు సార్ అంటుంది జానకి. మరి ఏ సాక్ష్యాన్ని ఆధారంగా మేము తీసుకోవాలి అని అడుగుతుంది ప్రభ. దీంతో సీసీటీవీ ఫుటేజ్ అని అంటుంది జానకి. దీంతో కంటెస్టెంట్ తో పాటు సునంద కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధ‌నుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైర‌ల్

Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…

16 minutes ago

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…

1 hour ago

Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !

husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…

2 hours ago

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!

Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…

3 hours ago

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

4 hours ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

5 hours ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

6 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

15 hours ago