Maadhavi Latha : రష్మిక అంతకంటే ఘోరంగా డ్రెస్సులు వేసుకుంది ‘ .. ఫేక్ వీడియోపై స్పందించిన నటి మాధవిలత..!

Authored By aruna | The Telugu News | Published on: November 9, 2023, 7:30 pm
  •  Maadhavi Latha : రష్మిక అంతకంటే ఘోరంగా డ్రెస్సులు వేసుకుంది ' ..

  •  ఫేక్ వీడియోపై స్పందించిన నటి మాధవిలత..!

Maadhavi Latha : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత దుర్వినియానికి పాల్పడుతున్నారో అందరికీ తెలిసిందే. మొన్ననే రష్మిక ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అంతకుముందు కూడా తమన్నా ముఖానికి సిమ్రాన్ మొహం పెట్టి వైరల్ చేశారు. ఆ మధ్య మోడీ, కెసిఆర్ పాటలు పాడినట్లుగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేశారు. ఈ టెక్నాలజీని ఈ విధంగా ఉపయోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా రష్మిక ఫేక్ వీడియో పై హీరోయిన్ మాధవి లత మరో రకంగా స్పందించారు.

ఆమె చేసిన కామెంట్లకి కొంతమంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రష్మిక డీప్ ఫేక్ వీడియో మరీ అంత దారుణంగా లేదని, అసభ్యకరంగా ఏమీ లేదని, ఆ అమ్మాయి కంటే రష్మికనే దారుణమైన డ్రస్సులు వేసుకుని ఈవెంట్ లు సినిమాల్లో ఎక్స్ పోజ్ చేసిందని, ఒక స్టార్ హీరోయిన్ ఒక విషయంపై స్పందిస్తే ఇలాగే రియాక్ట్ అవుతారని, పైగా ఇలాంటి వాటి మీద స్పందించడం కూడా మంచిదే, స్పందించాలి కూడా. రష్మిక కు సపోర్ట్ గా జర్నలిస్టు సంఘాలు నిలబడ్డాయని విన్నాను. అది నాకు నవ్వొచ్చింది.

రష్మికకు కాదు మీరు అండగా నిలబడాల్సింది. బయట ఎంతో మంది మహిళలకు అన్యాయాలు జరుగుతున్నాయి. వారికి అండగా ఉండండి. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించండి. రష్మిక ఏమి సాయి పల్లవి, సావిత్రి, మాధవి లతల పద్ధతిగా కనిపించదు అంటూ మాధవి లత చెప్పుకుంటూ పోయారు. దీంతో ఈ వీడియో పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొదటిసారి మాధవి లత కరెక్ట్ గా మాట్లాడారు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజమే కదా రష్మిక సినిమాలలో, ఈవెంట్లలో దారుణమైన డ్రస్సులు వేసుకుంటారు. అలాంటిది ఈ వీడియోలో ఆమె ఫేస్ మార్ఫింగ్ చేసినందుకు పెద్ద రచ్చ చేసారు అని కామెంట్స్ చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp