Nagarjuna : ఆయన కూడా అలాంటివాడే.. నాగార్జున పై ఆ హిరోయిన్ సంచలన కామెంట్స్..

Authored By mallesh | The Telugu News | Published on: December 14, 2021, 8:15 am

Nagarjuna: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ప్రజెంట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ షోపై ఇటీవల కాలంలో చాలా మంది కంప్లయింట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసే విధంగా ఈ షో లేదని, నెగెటివిటీ ప్రచారం చేసేలా ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు. సీపీఐ లీడర్ నారాయణతో పాటు కొంత మంది షోపై విమర్శలు చేశారు. తాజాగా మాధవీలత బిగ్ బాస్ హోస్ట్‌ నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసింది. ఫేస్ బుక్ వేదికగా తన పోస్టులో నాగార్జున హోస్టింగ్ విధానాన్ని తప్పుబట్టింది.‘బిగ్ బాస్’ షో సీజన్ ఫైవ్‌లో నాగార్జున పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించింది మాధవీలత.

మరో వారంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగియనుంది. ఈ క్రమంలోనే నాగార్జున హోస్టింగ్ విధానాన్ని విమర్శించింది. ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. సదరు పోస్టులో మాధవీలత నాగార్జున వైఖరిని తప్పుబట్టింది. నాగ్ మామా హోస్ట్ కాదని ఘోస్టని అన్నారు. కంటెస్టెంట్స్‌ తప్పులను కరెక్ట్ చేయకుండా వారికి నాగార్జున కౌంటర్ ఇస్తున్నారని అన్నారు. బుద్దిలేని వాడికి (షణ్ముక్ జస్వంత్) నాగార్జున సపోర్ట్ చేయడాన్ని బట్టి..నాగార్జున కూడా అలాంటి వాడే అని అర్థం అయిందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు వెయిట్ చేసి చూడగా నాగార్జున స్వభావం అర్థమయిందని, క్రియేటివ్ ఫీల్డ్‌లోకి ఇటువంటి యూజ్ లెస్ టీం‌ను తీసుకున్నారని.

maadhavi latha sensational comments on Nagarjuna

maadhavi latha sensational comments on Nagarjuna

Nagarjuna: చిన్నపిల్లలు చూసే విధంగా షో లేదని కామెంట్ చేసిన మాధవీ లత..

కంటెస్టెంట్స్‌ను విమర్శించొచ్చని, కానీ, అవమాన పరచొద్దని నాగార్జునకు సూచించింది. ఫేస్ బుక్‌లో పెట్టిన మరో పోస్టులో నాగార్జునను ఉద్దేశించి మీ కంటే చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చాలా మేలని, ఆయన్ను చూసి హోస్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలంది. బిగ్ బాస్ షో చూసి పిల్లలు ఫ్రెండ్స్ ముద్దు పెట్టుకోవచ్చా ? హగ్ చేసుకోవచ్చా? అని అడుగుతున్నారని ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ విధమైన నెగెటివ్ థాట్స్‌కు రెస్పాన్సిబులిటీ ఎవరు తీసుకుంటారని అడిగింది.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp