venkatesh : వామ్మో.. వెంకటేష్ కి ఎన్ని కోట్ల అస్తులున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!
venkatesh : తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలలో వెంకటేష్ ఫాలోయింగ్ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. 80 సినిమాలకు పైగా నటించిన ఈ ఫ్యామిలీ హీరో… ఇప్పటికీ.. సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన వెంకీ మామ ఇటీవల ఎఫ్-2 సినిమాతో బంపర్ హిట్ సొంతం చేసుకున్నారు. అనంతరం నారప్ప, దృశ్యం-2 చిత్రాలతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి హాట్రిక్ ను తన కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వెంకీ కి సంబంధించిన ఆస్తుల గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
7 వేల కోట్లకు పైనే..!
దగ్గుబాటి రామానాయుడి తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వెంకీ.. హీరోగానే కాక బిజినెస్ లో కూడా రాణిస్తూ తన సత్తా చాటుతున్నారు. అన్న సురేష్ బాబు సలహా మేరకు వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ వెంకీ కోట్ల పెట్టుబడులు పెట్టారట. ఈ అన్నదమ్ములిద్దరీ ప్రాపర్టీస్ అంతా కలుపుకొని ఇప్పటికి వీళ్ళ ఆస్తి 3250 కోట్ల వరకు ఉందని ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.. తన తండ్రి నుంచి వచ్చే ఆస్తులతో కలుపుకుంటే.. మొత్తం ఈ దగ్గుబాటి కుటుంబానికి 7 వేల కోట్లకు పైగే ఉందని సమాచారం.
1986 లో కలియుగ పాండవులు మూవీతో హీరోగా తెరంగేట్రం చేసిన వెంకీ… మొదటి సినిమాలో నటనకు గాను ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు ను సొంతం చేసుకున్నారు. దాంతో పాటు తన 35 యేళ్ల సినీ ప్రస్థానంలో మొత్తం 7 నంది అవార్డులను.. 6 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను ఆయన అందుకున్నారు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాల్లో.. చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి ఉన్నాయి. అన్నట్టు వెంకీ మామ రెండు హిందీ సినిమాలు కూడా చేశారు.