Mahanati Savitri : మహానటి సావిత్రి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో ఈమెకు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ సినిమాలల్లో సావిత్రిని తీసుకోవాలని ఎంతో ఆసక్తి చూపించేవారు. కేవలం దర్శకనిర్మాతలు మాత్రమే కాదు అప్పటి స్టార్ హీరోలు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్లు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఆమె తమ సినిమాలో నటిస్తే ఆ సినిమా పక్కా హిట్ అవుతుంది అని వారి నమ్మకం. ఇక సావిత్రి తన అందం, నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక అప్పట్లో సావిత్రి సినిమా వస్తుందంటే చాలామంది ఆమెను చూడడానికి సినిమా చూసేవాళ్ళు. అంతలా ఆమె జనాలను ఆకర్షించుకునేలా నటించారు.
ఇక మనకు తెలిసిందే ఆమె తమిళ హీరో జెమిని గణేషన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అతనికి అంతకుముందే పెళ్లయింది. ఆ విషయం తెలియని సావిత్రి పెళ్లి చేసుకున్నాక ఎంతో బాధపడింది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఆమె మద్యం తాగుడుకు బానిస అయిపోయారు. ఒకానొక సమయంలో ఆమె మద్యం తప్ప ఏమీ ముట్టుకొని పరిస్థితి కి చేరుకుంది. మందు ఉంటే చాలు అనే పరిస్థితికి దిగజారిపోయారు సీనియర్ నటిగా అనేకమందికి మార్గదర్శిగా ఉన్న సావిత్రి ఇలా అయిపోవడం అందరిని బాధ పెట్టింది. ఇదే అలవాటు చివరకు ఆమె అనారోగ్యానికి దారి తీసింది. ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయి దీంతో వైద్యులు మద్యం ముట్టుకోవద్దని తేల్చి చెప్పారు.
అయినా ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆమె బిడ్డలు బ్యాంకు పుస్తకాలు దాచిపెట్టి, డబ్బులు ఇవ్వకుండా చేశారు. దీంతో రాత్రివేళ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని సావిత్రి గొడవ చేయడంతో వాళ్లు పొమ్మని తెగేసి చెప్పారు. అయితే ఇటీవల సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఈ ఘటనపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ మేము మా అమ్మ మంచి కోసమే అలా చేశామని, కానీ తప్పు చేశామని అప్పట్లో భావించలేదు అని అన్నారు. ఏదేమైనా మహానటి సావిత్రి చివరి రోజుల్లో దారుణమైన స్థితిలో మరణించడం అత్యంత బాధాకరం. సినిమాల పరంగా సావిత్రి సక్సెస్ అయిన వ్యక్తిగతంగా ఆమెసక్సెస్ కాలేకపోయారు. చివరికి మద్యానికి బానిసై అత్యంత దారుణ పరిస్థితిలో మరణించారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.