Guntur Kaaram : మ‌హేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్‌.. గుంటూరు కారం రిలీజ్ డేట్ ఫిక్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guntur Kaaram : మ‌హేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్‌.. గుంటూరు కారం రిలీజ్ డేట్ ఫిక్స్..!

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లాస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. మహేశ్ బాబు చేతుల్లో ప్రస్తుతం రెండే సినిమాలు ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం. మరొకటి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా అంటే ఆ సినిమా గురించి మామూలుగా ఎక్స్ పెక్టేషన్స్ లేవు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :26 July 2023,2:00 pm

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లాస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. మహేశ్ బాబు చేతుల్లో ప్రస్తుతం రెండే సినిమాలు ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం. మరొకటి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా అంటే ఆ సినిమా గురించి మామూలుగా ఎక్స్ పెక్టేషన్స్ లేవు. ఆ సినిమా గ్లోబల్ మూవీ. ఆ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది కానీ.. మహేశ్ బాబు ఎందుకో ఈ మధ్య వెకేషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారట. దాని వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని అంటున్నారు. అయితే.. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేది త్రివిక్రమ్ కావడం వల్ల.. త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వచ్చే సినిమా కావడం వల్ల.. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.అయితే.. ఈ సినిమా రిలీజ్ కాకముందే చాలా బజ్ ను సంపాదించుకుంది. సినిమా ఫ్రెష్ షెడ్యూల్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుందట. ప్రస్తుతం మహేశ్ లండన్ లో వెకేషన్ లో ఉన్నారు.

guntur karam Movie

guntur karam Movie

Guntur Kaaram : రిలీజ్ కాకముందే భారీ బజ్ వచ్చేసింది

లండన్ వెకేషన్ పూర్తి కాగానే వెంటనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారట. అలాగే అక్టోబర్ పూర్తయ్యేలోపు సినిమా సగం షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఇక.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా భారీగానే నిర్వహించనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని త్రివిక్రమ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం మరి అప్పటి వరకు షూటింగ్ పూర్తవుతుందో లేదో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది