Home » Entertainment » Mahesh Babu And Rajamouli Movie Story Discussions
Entertainment

Mahesh Babu : మహేష్‌ బాబు రాజమౌళి సినిమా.. ఆ ఘండం దాటేనా?

Authored By
aruna
The Telugu News | Published on: August 19, 2022, 10:20 pm
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా చేసిన తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలని భావించాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేసేందుకు కన్ఫర్మ్‌ అయ్యాడు. దాదాపు పదేళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో మూవీ అనుకుంటే ఇన్నాళ్లకు అది వర్కౌట్‌ అవ్వబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో సినిమా అంటేనే ఒక స్థాయిలో జనాల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను చేసేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నారు. రాజమౌళి గతంలో మహేష్‌ బాబుతో సినిమా అనుకున్నప్పటికి కథ రెడీ అవ్వక పోవడం వల్లే మరో సినిమాను చేయాల్సి వచ్చింది. చాలా ఏళ్లుగా రాజమౌళి కోసం మహేష్ బాబు అభిమానులు వెయిట్‌ చేస్తూనే ఉన్నారు. గతంలో ఒకసారి రెండు సార్లు మహేష్‌ బాబుకు సరి పడ కథను జక్కన్న తీసుకు రాలేక పోవడంతో సినిమా క్యాన్సిల్ అయ్యింది. కనుక ఇప్పుడు కథ విషయంలో రాజమౌళి గండం దాటేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

mahesh babu and rajamouli movie story discussions

Advertisement

రాజమౌళి మరియు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ లు ఇప్పటికే కథ విషయంలో చర్చలు మొదలు పెట్టారు. మహేష్ బాబు కూడా ఈసారి కథ విషయంలో పట్టు విడుపు ప్రదర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు కేవలం తెలుగు దర్శకుడు కాదు.. ఆయన ఒక పాన్ ఇండియా స్థాయి దర్శకుడు. ఆయన గొప్ప దర్శకుడు అవ్వడం వల్ల ఆయనతో సినిమాకు ఏ ఒక్కరు కూడా నో చెప్పరు. అందుకే మహేష్ బాబు కూడా ఆయన రెడీ చేసే కథ ఏదైనా కూడా పూర్తిగా వినకుండానే సినిమాను చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. 2025 వరకు వీరిద్దరి కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి