Zodiac Signs : ఆగస్టు 20 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం. అన్నింటా విజయం. టెన్షన్ల నుంచి తప్పించుకుంటారు. వ్యాపారాలు చేసేవారికి శుభదాయకమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు తెలియని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా చికాకులు వచ్చే రోజు. రుణ ప్రయత్నాలు ఫలించవు. మీరు ఓపిక, నిగ్రహంతో వ్యవహరించాల్సిన రోజు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు కష్టపడాల్సిన రోజు. అనవసర కలలు కనకూడదు. రుణ ప్రయత్నాలు కలసి వస్తాయి. ప్రేమికుల మధ్య మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు. అతిగా పనిచేయుట మానసికఒత్తిడికి కారణము అవుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కొంత నిదానంగా ప్రవర్తిస్తారు. అనుకోని సమస్యలు రావచ్చు. విశ్రాంతి తప్పనిసరి అయిన రోజు. అనవసర ఖర్చులతో ధనం ఖర్చు అయిపోతుంది. స్నేహితులతో బయటకు వెళ్ళండం మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమజీవితం రంగులమయంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ ఆంజనేయస్వామి దండకాన్ని పారాయణ చేయండి.

Today Horoscope August 20 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు మీరు విలువైన వస్తువులు కొంటారు. పెద్దలతో కుటుంబ సమస్యలు చర్చించండి. ఆహ్లాదకర మైన ప్రశాంతతను, సామరస్యతను ఈరోజు మీరు అనుభవిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పనుల వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. ఓపిక, సహనం చాలా అవసరమైన రోజు. ధనం అవసరానికి చేతికి అందుతుంది. శ్రీ లక్ష్మీనారయణ స్వామి ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటరాఉ. ముఖ్యమైన విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. మీకుటుంబానికి అందిన ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆఫీస్‌లో మీ పని నైపుణ్యాలు, ప్రశంసనీయంగా ఉంటాయి. వ్యాపారస్తులకు , ట్రేడువర్గాలకు లాభాలు. శ్రీ విష్ణు సంబంధ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు అన్ని విషయాలలో జాగురూకతతో ఉండాలి. మీ పిల్లల వల్ల ప్రయోజనాలు ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు పొందే సూచన కనిపిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే మంచి పని చేస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు అనారోగ్య సూచన కనిపిస్తుంది. అన్నింటా వివాదాలకు అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి చెడువార్తలు వింటారు. ఆర్థికంగా మాత్రం కలసి వచ్చే రోజు. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలకు ఈరోజు ఇబ్బంది. అనుకోని ప్రయాణ సూచన. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు పెద్దల సలహాలు, ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడ జాగ్రత్త వహించండి. మిత్రుల ద్వారా మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రయాణాలలో సంతోషం, ఆనందం కలుగుతుంది. తెలివితేటలకు పని చెప్పాల్సిన రోజు. శ్రీ వేంకటశ్వర స్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. చాల కాలంగా వేచిచూస్తున్న శుభవార్తలు అందుతాయి. అన్నింటా జయం. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలలో లాభాలు. రియల్, షేర్, ట్రేడింగ్ వర్గాల వారికి శుభకరమైన రోజు. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ పద్మావతి, లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలతో సమస్యలను అధిగమిస్తారు. సానుకూలమైన రోజు. అన్నింటా మీకు విజయం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనుకోని అతిథి రాకతో ఇంట్లో సందడి వాతావరణం. సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి, మంచి అనుకూలమైన రోజు. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు పొందుతారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు నిరాశపూరితమైనరోజు. చికాకులు పెరుగుతాయి. ఆర్థికంగా మందగమనం. ప్రయాణాలలో అలసట, ఇబ్బందులు వస్తాయి. ఎవరితో అనవసర విషయాలు చర్చించకండి. దూర ప్రాంతం నుంచి అందే వార్త సాయంత్రం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పులు తీసుకోకండి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయనం చేయండి.

Recent Posts

Oriental Jobs : ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 26 ఖాళీలు

Oriental Jobs  : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…

21 minutes ago

Coffee : మీకో హెచ్చరిక.. ప్రతి రోజు కాఫీ తాగుతున్నారా..?

Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…

1 hour ago

Gurram Paapi Reddy : ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న గుర్రం పాపిరెడ్డి టీజర్..!

Gurram Paapi Reddy  : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…

8 hours ago

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

10 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

11 hours ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

12 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

13 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

14 hours ago