Mahesh Babu- Rajamouli : మహేష్ బాబు రాజమౌళి గూస్ బంప్స్ న్యూస్.. అలా అయితే రికార్డులు అన్ని సైడ్ అవ్వాల్సిందే.. అరాచకం అనిపించే అప్డేట్..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 10, 2022, 7:40 pm

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తుండగా ఈ మూవీ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి ఒక లైన్ అనుకున్నాడట. త్వరలోనే మహేష్ తో ఈ సినిమాకు సంబందించిన డిస్కషన్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ గురించి ఓ స్పెషల్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తుంది.

మహేష్ జక్కన్న కాంబోలొ వస్తున్న ఈ మూవీ ఒక సినిమాగా కాదు రెండు పార్టులుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కేవలం ఒక సినిమాగానే వచ్చింది. ఇప్పుడు మహేష్ సినిమాని మాత్రం రెండు పార్టులుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి. ఈ సినిమా తప్పకుండా అందరి అంచనాలను అందుకుంటుందని.

Mahesh Babu and Rajamouli Movies Playing in Two Parts

Mahesh Babu and Rajamouli Movies Playing in Two Parts

సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ సినిమా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని టాక్. రాజమౌళి కూడా మహేష్ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నారని తెలుస్తుంది. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ 300 కోట్ల పైన బడ్జెట్ తో వస్తుందని టాక్. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ వస్తుంది. సినిమా రేన్ ఏంటన్నది ఎనౌన్స్ మెంట్ రోజే తెలిసేలా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp