Home » Entertainment » Mahesh Babu Comments On Chiranjeevi
Entertainment

Mahesh Babu : చిరంజీవిపై చాలా సీరియ‌స్‌గా ఉన్న మహేష్ బాబు.. కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 18, 2022, 8:10 am
Advertisement

Mahesh Babu : క‌రోనా ప్ర‌భావం వ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విచిత్ర ప‌రిస్థితులు నెలకొన్నాయి. సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన కూడా అది అనుకున్న స‌మ‌యానికి రావ‌డం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఒక్క రోజులోనే మారిపోతున్నాయి. అయితే ముందుగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కొన్ని సినిమాలు కూడా వేరే సినిమాల కారణంగా వాయిదా పడాల్సి వస్తోంది. ఇక ఇటీవల ఆచార్య యూనిట్ సినిమా విడుదల తేదీ ని మారుస్తూ ఏప్రిల్ ఒకటవ తేదీ ఫిక్స్ చేశారు.

Advertisement

మహేష్ బాబు త‌న సినిమాని ఏప్రిల్ 1న ఎప్పుడో ఫిక్స్ చేయ‌గా, ఇప్పుడు సడెన్ గా చిరంజీవి త‌న సినిమాని తీసుకురావ‌డంతో మ‌హేష్ గుర్రుగా ఉన్నాడ‌ట‌. తనను సంప్రదించుకుండానే, తన నిర్ణయం ఏంటో తెలుసుకోకుండానే ఆచార్య టీం ప్రకటన చేసిందని, సర్కారు వారి పాట కోసం ఫిక్స్ చేసుకున్న తేదీని లాక్కున్నారంటూ మహేష్ బాబు త‌న స‌న్నిహితుల ద‌గ్గర చిరంజీవి, కొర‌టాల శివ‌పై సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఆచార్య సినిమా ఏప్రిల్ 1న రావ‌డానికి కార‌ణం స‌ర్కారు వారి పాట చిత్రం పోస్ట్ పోన్ కావ‌డమే అని మ‌రి కొంద‌రు అంటున్నారు.

mahesh babu comments on chiranjeevi

Advertisement

Mahesh Babu : ఇద్ద‌రికి చెడిందా…

మహేష్ బాబుకు కరోనా సోకడం, బయటి పరిస్థితులు కూడా బాగాలేకపోవడంతో షెడ్యూల్ వాయిదా పడేట్టు కనిపిస్తోంది.నిజానికి చిరంజీవికి మహేష్ బాబు కి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది అని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆచార్య దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబు రెండు సినిమాలు చేశారు కాబట్టి.. వారి మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అయితే స‌ర్కారు వారి పాట ఆగస్టు లోకి షిఫ్ట్ అయింది అని తెలుసుకున్న తర్వాతనే ఆచార్య ఏప్రిల్ ఒకటవ తేదీ ని ఫిక్స్ చేసుకున్నట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి