
Hero dhanush announced divorce with aishwaryaa rajinikanth
Dhanush Divorce : కొత్త ఏడాదిలో బ్యాడ్ న్యూస్ చెప్పి అభిమానులని ఆశ్చర్యానికి గురి చేశారు ధనుష్- ఐశ్వర్య దంపతులు. గత ఏడాది సమంత- నాగ చైతన్య అఫీషియల్‌గా విడాకుల విషయాన్ని ప్రకటించి కోలుకోలేని షాక్ ఇవ్వగా, ఇప్పుడు ధనుష్- ఐశ్వర్య విడిపోవడంపై అంతటా ఆసక్తికర చర్చ నడుస్తుంది. నవంబరు 18, 2004లో ఈ ప్రేమపక్షులు ఒక్కటయ్యారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్ హీరోగా థ్రిల్లర్ సినిమా ‘3’ని తెరకెక్కించారు.18 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్న ఈ జంట సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అందరు షాక్ అవుతున్నారు.
18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలు, తల్లిదండ్రులుగా, ఒకరికొకరం సన్నిహితులుగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మా మధ్య సన్నిహిత సంబంధాలు, అవగాహన, సర్దుబాట్లు చోటు చేసుకొన్నాయి. కానీ మేము కలిసి జీవించలేమనే పాయింట్‌కు చేరుకొన్నాం. ఐశ్వర్య నేను భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం .మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, మా ప్రైవసీని అర్ధం చేసుకొంటారని అనుకొంటున్నాను. ఓ నమశ్శివాయ. ప్రేమతో అంటూ ధనుష్ అంటూ పోస్టు పెట్టారు.ఇక ఐశ్వర్య కూడా తన సోషల్ మీడియలో ఇదే పోస్ట్ పెట్టింది.స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం.
Hero dhanush announced divorce with aishwaryaa rajinikanth
ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి… ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో ఐశ్వర్య పేర్కొంది. కొన్నాళ్ల క్రితం రజనీకాంత్ మరో కూతురు సౌందర్య కూడా విడాకులు తీసుకొని పారిశ్రామిక వేత్త విషాగన్ వనంగముడి అనే వ్యక్తిని పెళ్లి చేసుకొన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.